అల్లరి నరేష్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన సినిమాగా ‘నాంది’ని చెప్పుకోవచ్చు. ఏడెనిమిదేళ్లుగా హిట్ రుచి ఎరగని అతను.. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎప్పుడూ కామెడీ సినిమాలే చేసే అతను.. ఈసారి రూటు మార్చి పూర్తి సీరియస్ టైపులో ‘నాంది’ సినిమా చేశాడు. చేయని నేరానికి జైలుకు వెళ్లిన ఓ కుర్రాడు.. అక్కడి నుంచి బయటపడటం కోసం చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొన్ని నెలల కిందట విడుదలైన ‘నాంది’ టీజర్ ఇంటెన్స్‌గా ఉండి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ముఖ్య సన్నివేశాల కోసం నరేష్ నగ్నంగా కనిపించడం గమనార్హం. టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా పరిస్థితులు బాగుంటే థియేటర్లలోనే రిలీజయ్యేది. కానీ అలా లేని నేపథ్యంలో ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు సమాచారం.
అమేజాన్ ప్రైమ్‌లో ‘నాంది’ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. డిసెంబర్లో విడుదల ఉండొచ్చని సమాచారం. తెలుగులో ‘వి’, ‘నిశ్శబ్దం’ లాంటి పెద్ద సినిమాలను భారీ రేటుకు కొని.. అవి ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో దెబ్బ తిన్న ప్రైమ్.. ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాల మీద దృష్టిపెట్టింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిన్న సినిమాను నవంబర్లో ఆ సంస్థ రిలీజ్ చేయబోతోంది. దాని తర్వాత దాన్నుంచి రాబోయే చిత్రాల్లో ‘నాంది’ ఒకటని తెలిసింది.
‘సుడిగాడు’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నరేష్.. ఆ తర్వాత రెండంకెల సంఖ్యలో సినిమాలు చేయగా.. ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రత్యేక పాత్రలో నటించిన ‘మహర్షి’ ఒకటి బాగా ఆడింది. చివరగా అతను ‘సిల్లీ ఫెలోస్’ అనే కామెడీ సినిమాతో పలకరించాడు.
This post was last modified on October 12, 2020 11:37 am
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్‌కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…