తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ ఆఖరికి ఫిబ్రవరి 7 లాక్ చేసుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ పట్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే అది కంటెంట్ గురించి కాదులెండి. ప్రమోషన్ల విషయంలో వారి ఆందోళన సబబే. సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, తర్వాతి పరిణామాలు, ప్రెస్ మీట్లు, లీగల్ వ్యవహారాలు తదితర పనుల్లో అల్లు అరవింద్ చాలా బిజీగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా ఆయన మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. బన్నీకి క్లీన్ చిట్ రావాలని ఆయన ఆకాంక్ష.
ఇంకోవైపు అల్లు కుటుంబానికి అత్యంత ఆప్తుడు బన్నీ వాస్ సైతం కేసు పనుల్లోనే ఉన్నాడు. ఎక్కువ సమయం అల్లు అర్జున్ తోనే ఉంటూ స్నేహితుడి బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తండేల్ ప్రమోషన్లు ఎలా చేయాలనే ఆలోచన చేయడం కష్టం. అల్లు అరవింద్, బన్నీ వాస్ ఇద్దరూ కంటెంట్ మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేశారు. ఆ నమ్మకంతోనే ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్ డేట్ సెట్ చేసుకుని నాగచైతన్యకు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని డిసైడయ్యారు. కానీ పుష్ప 2 విడుదల నుంచి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. గీతా కాంపౌండ్ లో తండేల్ మాట వినిపించడం తగ్గింది.
అయితే టెన్షన్ పడాల్సిన పనేం లేదనేది ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం. ఎంధుకంటే బన్నీ కేసు ఎంత తీవ్రంగా ఉన్నా త్వరలోనే ఒక కొలిక్కి రావొచ్చని లాయర్ వర్గాల అంచనా. సాక్ష్యాలు ఎంత బలంగా ఉన్నా సరే అల్లు అర్జున్ నేరుగా నేరస్థుడు కాదు కాబట్టి కోర్టు ఆ కోణంలో చూస్తే సానుకూల ఫలితం రావొచ్చని అంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తండేల్ కి గ్రాండ్ రిలీజ్, నెవర్ బిఫోర్ పబ్లిసిటీ కోరుకుంటున్నారు. సాయి పల్లవీ హీరోయిన్ గా నటించిన తండేల్ లో దేవిశ్రీ ప్రసాద్ పాటలు మెయిన్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి చివరిలో ప్లాన్ చేసుకున్నారని సమాచారం.
This post was last modified on December 24, 2024 4:53 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…