అల్లు అర్జున్‌ను చిక్కడ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఆయనను రెండు విడతలుగా మంగళవారమే విచారించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి విచారణకు ఆహ్వానించిన పోలీసులు.. ఇన్ని గంటలు.. అన్ని గంటలు అని పేర్కొనలేదు. ఉదయం 10 గంటల కు విచారణకు రావాలని మాత్రమే నోటీసులు ఇచ్చారు. దీంతో ఎలాంటి సందేహాలు.. వాయిదాలు కోరకుండానే అల్లు అర్జున్ విచారణకు వచ్చారు. ఆయన వెంట తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం సాగుతున్న విచారణ.. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి రెండుమూడు గంటలకే పరిమితం చేయాలని అనుకున్నా.. పరిస్థితి తీవ్రత.. ఉన్నతాధికారుల ఆదేశాలు నేపథ్యంలో డీసీపీ, ఏసీపీ స్తాయి నుంచి డీఐజీ స్థాయి వరకు విచారణ జరిపే అవకాశం ఉందని తెలిసింది. సాధారణ అంశాలతోపాటు.. లీగల్ అంశాలపైనా అర్జున్‌ను విచారించనున్నారు. ఈ క్రమంలో వారి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సిద్ధమయ్యారు.
మరోవైపు.. ఏం జరిగినా.. క్షణాల్లో కోర్టును ఆశ్రయించేలాగా కూడా.. అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. హైకోర్టు పరిధిలో అల్లు న్యాయవాదులు సిద్ధమయ్యారని తెలిసింది. మొత్తంగా నలుగురు న్యాయవాదులు హైకోర్టు వద్ద.. ఒకరు చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లోనూ ఉన్నారు. మరొకరు ఏం జరుగుతుందో దాని ప్రకారం తక్షణ స్పందన కోసం.. లైవ్‌లోనూ వేచి చూస్తున్నారు. మొత్తానికి విచారణ ప్రక్రియకు హాజరు అవుతూనే.. అన్ని అస్త్రశస్త్రాలు కూడా.. అల్లు అర్జున్ రెడీ చేసుకుని అడుగులు బయట పెట్టడం విశేషం.
భార్యతోడుగా!
చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరయిన అల్లు అర్జున్ తొలుత.. ఇంటి నుంచి బయలు దేరే ముందు.. సతీమణి తోడు రాగా.. కారు ఎక్కారు. ఆ సమయంలో భార్య మొహంలో ఉద్విగ్నత కనిపించింది. తర్వాత.. కుమార్తె తండ్రిని చూస్తూ.. చేయి ఊపింది.. అనంతరం.. ఇద్దరు అనుచరులతో అల్లు అర్జున్ కారు చిక్కడపల్లి వైపు బయలు దేరింది. వేరేకారులో ఆయన మామ, తండ్రి, న్యాయవాది, బన్నీ వాసు తదితరులు పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
This post was last modified on December 24, 2024 12:46 pm
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.…