కొన్ని సరదాగా వినడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే అవి నిజమైతే కలిగే భయం ఎక్కువ కాబట్టి. నిజ జీవితమైనా వెండితెరకైనా రెండింటికి అది వర్తిస్తుంది. ఇటీవలే అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. యాంకరింగ్ లో భాగంగా యాంకర్ సుమ అతిథిగా వచ్చిన సుకుమార్ ని ఒక ప్రశ్న అడిగింది. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారు అని. ఆయన ఠక్కున సినిమా అని చెప్పేయడంతో ఒక్కసారిగా పక్కనున్న రామ్ చరణ్ షాకుకు గురై వెంటనే సుకుమార్ ను ఆప్యాయంగా నిలువరిస్తూ మైకు తీసుకుని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇలాగే సంవత్సరం నుంచి ఇదే మాట అంటూ భయపెడుతున్నారు, కానీ అలాంటిది ఏమి జరగదని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా సుమతో అక్కడ ఉన్న వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. పుష్ప 2 ది రూల్ లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించి బాలీవుడ్ నెంబర్ వన్ మూవీని అందించిన డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది సుకుమార్ పేరే. మేకింగ్ పరంగా ఆలస్యం చేస్తారనే కామెంట్స్ ఆయన మీద ఉండొచ్చు గాక. కానీ అలా చేయడం వల్లే ఇంత క్వాలిటీ అవుట్ ఫుట్స్ ఇస్తున్నారని అనుకోవచ్చుగా. ఎందుకంటే పుష్ప లాంటి కమర్షియల్ బ్రాండ్ ని సృష్టించడానికి సుకుమార్ పడిన కష్టం అందరికీ తెలిసిందే.
బుచ్చిబాబుతో ప్యాన్ ఇండియా మూవీ అయ్యాక రామ్ చరణ్ చేయబోయేది సుకుమార్ తోనే. రంగస్థలం కాంబో మరోసారి రిపీట్ కానుండటంతో అంచనాలు మాములుగా లేవు. బ్యాక్ డ్రాప్, జానర్ ఇవేవి ఇంకా ఫైనల్ కాలేదు కానీ ప్రాధమికంగా స్టోరీ లైన్ మాత్రం ఓకే అయ్యిందని సమాచారం. జనవరి 10 న విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ పూర్తవ్వగానే చరణ్ ఆర్సి 16 తిరిగి కొనసాగిస్తాడు. సుకుమార్ చిత్రాన్ని 2025 వేసవిలో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. మరి పుష్ప 3 ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎంత ఆలస్యమవుతుందనే దాన్ని బట్టి ఈ ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు.
This post was last modified on December 24, 2024 11:20 am
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…
మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…