సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు తాజాగా మరో హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ సాయం లేకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నారని వైద్యులు వెల్లడించారు. తెల్ల రక్త కణాలతోపాటు మిగతా రక్తకణాల సంఖ్య మెరుగుపడుతోందని చెప్పారు.
ఆహారం తీసుకోగలుగుతున్నాడని అన్నారు. అయితే, జ్వరం తగ్గలేదని, నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. కాగా, శ్రీ తేజ్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ రోజు ఆస్పత్రిలో పరామర్శించారు. శ్రీ తేజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. శ్రీ తేజ్ తండ్రికి నిర్మాత నవీన్ ఆ చెక్కును అందించారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో రూ.50 లక్షల చెక్‌ను నిర్మాతలు అందించారు.
మరోవైపు, అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత చెబుతున్నారు. కాగా, శ్రీ తేజ్‌ను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ హాస్పిటల్ బిల్లు చెల్లింపు వ్యవహారంపై కూడా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆ వ్యవహారంపై శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ స్పందించారు. తాను శ్రీ తేజ్ ను ఆస్పత్రిలో చేర్చినపుడు రూ.50 వేలు మాత్రమే కట్టానని, ఆ తర్వాత హాస్పిటల్ బిల్లును ప్రభుత్వం, అల్లు అర్జున్ టీం పెట్టుకుందని భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on December 23, 2024 9:16 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…