Movie News

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చుకున్న రాబిన్ హుడ్ తర్వాత వాయిదా నిర్ణయం తీసుకుని మళ్ళీ ఎప్పుడు విడుదల చేయాలో ఇంకా తేల్చుకోలేని అయోమయంలో ఉంది. ఒకవైపు పుష్ప 2 ది రూల్ వసూళ్ల హడావిడి, ఇంకోవైపు తమ హీరో అల్లు అర్జున్ ఇరుకున్న కేసు తాలూకు పంచాయితీ వల్ల మైత్రి మేకర్స్ ఇప్పుడు ఏ ప్రమోషన్ మీద దృష్టి పెట్టే పరిస్థితిలో లేరు. ఒకరకంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ తప్పుకోవడం మంచిదే. కానీ నితిన్ మాత్రం ఈ డెసిషన్ పట్ల ముందు నుంచి సానుకూలంగా లేడనేది ఫిలిం నగర్ టాక్.

ఏది ఏమైనా రాబిన్ హుడ్ మంచి ఛాన్స్ మిస్సయ్యాడు. ఎందుకంటే మొన్న వచ్చిన నాలుగు కొత్త రిలీజుల్లో దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. బచ్చల మల్లి కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలం కాగా విడుదల పార్ట్ 2ని మన ఆడియన్స్ లైట్ తీసుకున్న వైనం వసూళ్లలో కనిపించింది. ఉపేంద్ర యుఐకి మంచి హడావిడితో పాటు కలెక్షన్లు వస్తున్నాయి కానీ తెలుగులో ఇదేదో లాంగ్ రన్ సాధించబోయే సూపర్ హిట్ మాత్రం కాబోదు. ఒకవేళ వీక్ డేస్ కూడా స్ట్రాంగ్ గా నిలబడితే గొప్పని ఒప్పుకోవచ్చు. మహేష్ బాబు డబ్బింగ్ పుణ్యమాని ముఫాసాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దానికన్నా భారీ వసూళ్లు వచ్చాయి.

ఈ మొత్తం పిక్చర్ లో బాక్సాఫీస్ వ్యాక్యూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా సినిమాకు వెళ్లాలంటే మూడో వారంలో కూడా జనం పుష్ప 2నే ఛాయస్ గా పెట్టుకుని హౌస్ ఫుల్స్ చేశారంటేనే నితిన్ ఏం మిస్ చేసుకున్నాడో అర్థమవుతుంది. ఒకవేళ రాబిన్ హుడ్ కనక ఇప్పుడొచ్చి పాజిటివ్ టాక్ కనక తెచ్చుకుని ఉంటే మంచి నెంబర్లు కనిపించేవి. అయితే షూటింగ్ కాకపోవడం వల్లనో పోస్ట్ ప్రొడక్షన్ లాంటి ఇతర కారణాల వల్లనో ఏదైతేనేం తప్పుకోవడం వల్ల నష్టమైతే జరిగింది. సంక్రాంతికి వచ్చినా రిపబ్లిక్ డేకి వెళ్లినా లేదా ప్రచారం జరుగుతున్నట్టు ఏప్రిల్ 10 ఎంచుకున్నా రాబిన్ హుడ్ కి చాలా పెద్ద పోటీ స్వాగతం చెప్పబోతోంది.

This post was last modified on December 23, 2024 3:47 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago