అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ వేదిక దగ్గర ప్రత్యక్షంగా ఉన్న వేలాది అభిమానులు, కవరేజ్ కోసం ఉన్న మీడియా ప్రతినిధుల ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్, వీడియోస్ క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. మధ్యలో స్పెషల్ బోనస్ గా దోప్ సాంగ్ రిలీజ్ చేయడం, అందులో రామ్ చరణ్ స్టెప్పులు క్రేజీగా ఉండటం హైప్ ని ఇంకాస్త పైకి తీసుకెళ్లాయి. ఇటీవలే పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్బస్టర్ హిట్ సాధించిన సుకుమార్ ముఖ్యఅతిథిగా వెళ్లి మంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి పంచుకున్నారు.
దాని ప్రకారం గేమ్ ఛేంజర్ ని చిరంజీవితో కలిసి సుకుమార్ చూసేశారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ స్థాయిలో ఉందని, ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ ఇస్తుందని, క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు అవార్డు రావడం ఖాయమని తెగ ఊరించేసారు. సినిమాని పూర్తిగా చూసి ఉంటే తప్ప ఇంతా కాన్ఫిడెంట్ గా చెప్పరు కాబట్టి ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు. రామ్ చరణ్ 17 దర్శకుడు సుకుమారే. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో ఇదేమైనా ఆలస్యమవుతుందేమోనని ఫ్యాన్స్ అనుమానం. ఇంకొద్ది రోజులు ఆగితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
దిల్ రాజు, శంకర్, సుకుమార్, అంజలి, ఎస్జె సూర్య ఇచ్చిన ఎలివేషన్లను బట్టి చూస్తే గేమ్ ఛేంజర్ ఇప్పటిదాకా హైప్ లో వెనుకబడిన బలహీనతను కవర్ చేసుకుంటూ బలం పెంచుకుంటోంది. పబ్లిసిటీ విషయంలో ఎస్విసి టీమ్ ప్రత్యేక శ్రద్ధ వహించబోతోంది. జనవరి 10 దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు రాజుగారు చెప్పడం చూస్తే పుష్ప 2 స్థాయిలో ప్లానింగ్ జరుగుతోందని అర్థమవుతోంది. ఏపీ తెలంగాణలో జరగబోయే ఈవెంట్లలో బజ్ ని మరింత పైకి తీసుకెళ్ళబోతున్నారు. ఇంకొక్క ఎమోషనల్ సాంగ్ తో పాటు గేమ్ ఛేంజర్ ట్రైలర్ బాకీ ఉన్నాయి. వీటి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
This post was last modified on December 22, 2024 2:49 pm
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…