ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యం కలిగించింది. ఇక బన్నీ అదే రాత్రి వివరణ ఇవ్వగా విషయం దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడవ ఎలా ఉన్నా కూడా పుష్ప 2 సౌండ్ నేషనల్ వైడ్ గా వైరల్ అవుతోంది. ఇక ఆదివారం కూడా కలెక్షన్లు గట్టిగానే పెరిగే అవకాశం ఉంది.
విడుదలైన 17 రోజుల్లోనే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటడం సినీ రంగంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా అద్భుతంగా రాణిస్తుండగా, శనివారం ఒక్క రోజే రూ.25 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌లో పుష్ప-2 ఇప్పటికే రూ.302.35 కోట్లను రాబట్టగా, హిందీ వెర్షన్‌లోనే రూ.652.9 కోట్లు సంపాదించింది. దేశవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1029.9 కోట్లకు చేరుకోవడం విశేషం.
శనివారం వచ్చిన ఈ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఇక ఆదివారం వసూళ్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బాహుబలి-2 కలెక్షన్ల రికార్డుకు పుష్ప-2 అత్యంత చేరువగా ఉంది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 దేశవ్యాప్తంగా రూ.1040 కోట్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 అదే రికార్డును బద్దలు కొట్టే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ లాంటి సెలవుల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో పుష్ప-2 హవా మరింత కొనసాగుతుందని టాక్.
This post was last modified on December 22, 2024 1:55 pm
తెలుగులో గొప్ప దర్శకులు అని పేరు తెచ్చుకున్న వాళ్లందరూ పని రాక్షసులే. ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి…
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో టైర్-2లో టాప్ హీరో. ‘ది ప్యారడైజ్’ సినిమా అంచనాలను అందుకుంటే.. అతను టైర్1…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ…
సినిమా అనేది అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. మంచైనా, చెడైనా జనాల్లోకి చాలా వేగంగా తీసుకువెళ్లే మీడియం ఇది. దీన్ని మంచి…
ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు…
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…