ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. జనవరి 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి కలుద్దాం.. ఇవి మాత్రమే రిలీజ్ కానున్నాయి. వీటిలో ‘గేమ్ చేంజర్’ చాలా పెద్ద సినిమా. దాని బడ్జెట్, మార్కెట్, రిలీజ్ అన్నీ కూడా వేరు. ‘డాకు మహారాజ్’ కూడా కొంచెం పెద్ద సినిమానే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మిడ్ రేంజ్ మూవీగా చెప్పొచ్చు. ఐతే స్థాయి పరంగా చిన్నదైనా వెంకీ మూవీని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.
మిగతా రెండు చిత్రాలకు దీని నుంచి ముప్పు పొంచి ఉందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. బడ్జెట్, రిలీజ్ పరంగా మిగతా రెండు చిత్రాలతో పోటీ పడే స్థాయిలో లేకపోయినా.. ప్రేక్షకులను ఆకర్షించే విషయంలో ఈ సినిమా తక్కువేమీ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా బజ్‌ను పరిశీలించినా ‘సంక్రాంతికి వస్తున్నాం’ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ పట్ల ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇంట్రెస్ట్స్ వేగంగా పెరిగిపోతున్నాయి.
ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ‘గోదారి గట్టు మీద..’ పాట చార్ట్ బస్టర్ అయిపోయింది. మిగతా ప్రోమోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో టీజర్ లాంచ్ చేయబోతున్నారు. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే అంచనాలుండగా.. అందుకు తగ్గట్లుగా టీజర్ ఉంటే.. అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం. సంక్రాంతికి ఈ తరహా ఫ్యామిలీ సినిమాలను చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సినిమాలు సంక్రాంతికి ఎలా ఆడాయో తెలిసిందే. కాబట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకర్షించడం ఖాయం.
బాగా ఆలస్యం కావడం వల్ల ‘గేమ్ చేంజర్’ మీద మోయలేనంత భారం ఉంది. బడ్జెట్ ఎక్కువ. బిజినెస్ టార్గెట్లు కూడా పెద్దవే. ‘డాకు మహారాజ్’ బడ్జెట్ ఎక్కువే పెట్టారు. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సేఫ్ జోన్లో ఉంది. రిస్క్ లేకుండా రిలీజవుతున్న ఈ చిత్రం.. మిగతా రెండు చిత్రాల కలెక్షన్లకు గండి కొట్టేలా కనిపిస్తోంది. కాకపోతే ‘గేమ్ చేంజర్’ను ప్రొడ్యూస్ చేయడంతో పాటు ‘డాకు మహారాజ్’ను నైజాం, వైజాగ్ ఏరియాల్లో రిలీజ్ చేస్తున్నది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిర్మాత దిల్ రాజే కావడం గమనార్హం. కాబట్టి దేనికి లాభం వచ్చినా, దేనికి నష్టం వచ్చినా ఆయన ఖాతాకే చేరుతుంది.
This post was last modified on December 21, 2024 10:12 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…