పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా.. అక్కడే ఉన్నారని.. అందుకే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి స్పందించారు. ఈ ఘటన కేవలం ప్రమాదమేనని చెప్పారు. ఎవరూ కావాలని చేసింది కాదన్నారు.
రేవతి అనే మహిళ మరణం బాధకలిగించిందని అర్జున్ చెప్పారు. బాలుడు శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇక, తాను రోడ్ షో చేశానన్న వ్యాఖ్యలను కూడా.. అల్లు అర్జున్ ఖండించారు. అది రోడ్ షో కాదని.. కారు వెళ్తున్న క్రమంలో ఆగిపోయిందని.. దీంతో తాను అభిమానులను పలకరించానని చెప్పారు. ఇది దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకే తాను సినిమాలు చేస్తున్నానని చెప్పారు. సినిమా పెద్ద హిట్టయినా.. తాను 15 రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నానని తెలిపారు. ప్రజలకు వినోదం పంచాలన్న ఏకైక లక్ష్యంతోనే సినిమాలు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వంతో వివాదాలు తాను కోరుకోవడం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ఆ రోజు అనుమతి లేకుండా.. వెళ్లానని అనడం సరికాదని.. తాము పోలీసులకు సమాచారం అందించిన తర్వాతే హాల్ కు వెళ్లానని అర్జున్ వివరించారు. తొక్కిసలాట వ్యవహారం.. తనకు స్పాట్‌లో తెలియలేదని.. మరుసటి రోజు మాత్రమే తెలిసిందని అర్జున్ చెప్పారు. అయితే.. ఈ విషయంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతో బాధకలిగిస్తున్నాయని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ మీడియా ముందు తనను అప్రతిష్ఠపాల్జేస్తున్నారని అర్జున్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ లోనీ వ్యాఖ్యలు బాధించాయి.
బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి.. తాను ఆసుపత్రికి వెళ్లి పరామార్శించాలని అనుకున్నట్టు అర్జున్ చెప్పారు. అయితే.. పోలీసులే తనను వద్దని చెప్పారని వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందని.. దీనిలో ఎవరి తప్పు లేదన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదన్నారు.
అసెంబ్లీ లో నాయకులు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అర్జున్ చెప్పారు. విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని అనుకుని కూడా.. ఈ ఘటన తర్వాత.. వాయిదా వేసుకున్నట్టు అర్జున్ తెలిపారు. పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులే గాయపడితే.. తానుతట్టుకోలేనని.. అలాంటిది తన అభిమానులకు ఏమైనాజరిగితే ఎలా ఉంటానని ప్రశ్నించారు. కాగా, ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అరవింద్, వారి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
This post was last modified on December 21, 2024 8:31 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…