బిగ్‍బాస్ ఇంతకుముందు సీజన్లలో కనీసం ఒక్క లేడీ కంటెస్టెంట్ అయినా స్ట్రాంగ్‍గా వుండేది. మొదటి సీజన్లో హరితేజ, రెండవ సీజన్లో గీతా మాధురి, మూడవ సీజన్లో శ్రీముఖి వుండడంతో ఫైనల్ ఫైవ్‍లో లేడీస్ ప్రెజెన్స్ గురించిన చింత వుండేది కాదు.
కానీ ఈ సీజన్లో ఆడవాళ్లు ఎవరూ స్ట్రాంగ్‍గా లేరు. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పిన టీవీ9 దేవిని మూడవ వారంలోనే ఎలిమినేట్ చేసేసారు. ఇక మిగిలిన వారిలో ఎవరికీ బిగ్‍బాస్ ఆడే సత్తా వున్నట్టు అనిపించడం లేదు.
ఇప్పటికే వరుసగా నాలుగు వారాలలో నలుగురు లేడీస్ బయటకు వచ్చేసారు. ఆదివారం సుజాత కూడా ఎగ్జిట్ అవుతోంది. దీంతో వరుసగా అయిదుగురు ఆడాళ్లు బిగ్‍బాస్ నుంచి బయటకు వచ్చినట్టవుతుంది.
మోనల్ గజ్జర్ మ్యానిప్యులేటివ్ అని ఆడియన్స్ పసిగట్టడంతో ఆమెకు సరిగా ఓట్లు పడడం లేదు. హారిక ఏమో అభిజీత్ వెనుక, అరియానా ఏమో అవినాష్ వెంట వుంటూ ఫుటేజీ కోసం చూస్తున్నారు.
యాంకర్ లాస్యకి అనుకోని షాకులు తగలడంతో ఆమె బాగా సైలెంట్ అయిపోయి, తన ఓట్ షేర్ బాగా పడిపోయింది. దివి యూత్‍ని ఆకట్టుకున్నా కానీ అమ్మ రాజశేఖర్ ప్రభావంలో పడి వెనకబడిపోయింది. ఇప్పుడు హౌస్ లో వున్న వారిలో ఫైనల్ ఫైవ్ చేరతారని అనిపిస్తోన్న వారిలో అందరూ మగాళ్లే వున్నారు. బిగ్‍బాస్ పట్టుబట్టి లేడీస్‍ని కాపాడుకుంటే తప్ప ఫైనల్ ఫైవ్ కంటే ముందే ఆడాళ్లంతా ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ సీజన్ కోసం కనీసం ఇద్దరు గట్టి లేడీ కంటెస్టెంట్లయినా వుండాలని ఇప్పట్నుంచే వేటాడుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.
This post was last modified on October 12, 2020 11:02 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…