తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు సామాన్యులను సైతం షాక్ కు గురి చేసింది. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఒక మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు బ్రెయిన్ డెడ్ స్థితిలో ఆసుపత్రిలో పోరాడటాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో మరోసారి ప్రత్యక్షంగా అర్థమయ్యింది. అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి మరీ పరిశ్రమ ప్రముఖులు పరామర్శకు వెళ్లడం గురించి ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేకపోయింది. ఇకపై టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టంగా తేల్చి చెప్పేశారు.
2025లో చాలా ప్యాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, తేజ సజ్జ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. ఇప్పుడు హఠాత్తుగా బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటి వెసులుబాట్లు లేవంటే వీటికి కలగబోయే నష్టం తీవ్రంగా కాదు కానీ భారీగానే ఉంటుంది. ఉదాహరణకు పుష్ప 2కి ఇచ్చిన పెంపు ఒక్క నైజాం నుంచే కొన్ని కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఎంతలేదన్నా ఆ మొత్తం పాతిక కోట్ల పైమాటేనని ఒక అంచనా. అలా రాబోయే సినిమాలకు అన్నీ కలిపి లెక్కేసుకుంటే వచ్చే ఫైనల్ ఫిగర్ షాక్ ఇవ్వడం ఖాయం.
సరే ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో మిడ్ నైట్ షోలు వేయకుండా కేవలం ఏపీలోనే వేస్తే టాక్ పరంగా అదో తలనెప్పి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. అటుఇటు అయ్యిందంటే అంతే సంగతులు. ఇలా ఎన్నో సమీకరణాలు దీని వెనుక ఉంటాయి. పైగా అభిమానుల డిమాండ్లు మరో చిక్కు. రెండు చోట్ల ఒకేసారి వేయమని అడిగితే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఒకవేళ సంధ్య థియేటర్ ఘటనలో ఎవరూ చనిపోకపోతే ఈ డిస్కషన్ ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తు అయ్యింది. భవిష్యత్తు గురించి వెంటనే అంచనాకు రాలేం కానీ ఇప్పుడప్పుడే పరిష్కారం దొరకదనేది వాస్తవం.
This post was last modified on December 21, 2024 5:38 pm
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…