గత ఏడాది గదర్ 2తో బాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టి ఫేడవుట్ అయిన సన్నీ డియోల్ కు కొత్త కెరీర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ శర్మ. కొన్నేళ్లుగా సరైన విజయం లేక బాగా వెనుకబడిన ఈ నిన్నటి తరం డైరెక్టర్ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేయడంతో వందల కోట్ల బడ్జెట్ తో గదర్ 3 తీసేందుకు రంగం సిద్ధమయ్యింది. సరే మధ్యలో ఖాళీగా ఉండటం ఎందుకని నానా పాటేకర్ ప్రధాన పాత్రలో వన్ వాస్ అనే సినిమా తీశాడు. అది నిన్న విడుదలైన సంగతే చాలా మందికి తెలియదు. ఒకపక్క పుష్ప 2 ర్యాంపేజ్, ఇంకోవైపు డిసెంబర్ 25 రాబోతున్న బేబీ జాన్ హడావిడి వల్ల ఇది ఎవరి దృష్టికి పెద్దగా రాకుండా రిలీజైపోయింది.
తీరా చూస్తే థియేటర్లలో జనాలు లేరు. దేశవ్యాప్తంగా వచ్చిన నెట్ కేవలం లక్షల్లోనే ఉంటుందని ట్రేడ్ టాక్. అయిదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా తీసిన దర్శకుడి ప్రాజెక్టు అంటే ఏ స్థాయిలో హైప్ ఉండాలి. కానీ వన్ వాస్ కి అదేమీ లేదు. పాయింట్ పరంగా కథ బాగానే ఉంది. భార్య పోయిన దుఃఖంలో ఉన్న భర్త ఆమె జ్ఞాపకం కోసం కోట్లు విలువ చేసే ఇంటిని ఛారిటీగా మార్చాలనుకుంటాడు. డబ్బుకు ఆశపడిన పిల్లలు ఈయన్ని వారణాసి తీసుకెళ్లి వదిలేస్తారు. అల్జీమర్స్ వ్యాధి ఉండటంతో మందులు లేకపోతే జ్ఞాపకశక్తి పోతుందని భావిస్తారు. ప్రపంచానికి చనిపోయాడని నమ్మిస్తారు. ఆ తర్వాత జరిగిదే స్టోరీ.
దర్శకుడు అనిల్ శర్మ తీసుకున్న నేపథ్యం మరీ పాత స్కూల్ తరహాలో ఉండటంతో పాటు కథనం నెమ్మదిగా మరీ ఆసక్తి రేగేలా లేకపోవడం వన్ వాస్ ని మాములుగా మార్చేసింది. బోలెడు ఓపిక ఉండి భారీ ఎమోషన్లు కోరుకుంటే తప్ప చూడలేం. టాక్ సంగతి ఎలా ఉన్నా కనీసం మొదటి రోజు ఓపెనింగ్స్ కి నోచుకోకపోవడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 మానియా తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఆడవని, ఇంకొన్ని వారాలు ఆగి రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అర్బన్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని తీసే సినిమాలకు హిందీలో కాలం చెల్లినట్టుంది.
This post was last modified on December 21, 2024 1:40 pm
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి…
హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా…
ఒకప్పుడు కామెడీ సినిమాలంటే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు.…
వెంకటేష్ ప్రేమంటే ఇదేరాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి ఆల్బమ్ తోనే సూపర్ హిట్ కొట్టిన సంగీత దర్శకుడు రమణ గోగులకు…
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు నైతిక విలువల సలహాదారుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు,…
ప్రతిసారి అమెరికా పౌరసత్వం పొందే విదేశీయుల సంఖ్యలో భారతీయుల వాటా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…