నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత తరహాలో కామెంట్స్ వినిపించాయి. విమర్శకులు, విశ్లేషకులు ఇదేం సినిమా అంటూ పెదవి విరిచారు. ఒకటి నుంచి రెండు మధ్యలో రేటింగ్ ఇవ్వడానికే కిందా మీద పడ్డారు. మధ్యలో లేచొచ్చిన సాధారణ ప్రేక్షకులున్నారు. చివరి దాకా చూసి వావ్ అన్న ఆడియన్సూ కనిపిస్తున్నారు. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఉప్పి చెప్పినట్టు డీ కోడ్ చేసుకుంటే తప్ప కంటెంట్ అర్థం కాదన్న మాట నిజమే అయ్యింది. అయితే గమనించాల్సిన అసలు విచిత్రం మరొకటి ఉంది.
ఈ వెరైటీ టాక్ వింటూ కూడా యుఐ థియేటర్లకు జనం బాగానే వెళ్తున్న వైనం బుకింగ్ ట్రెండ్స్ లో కనిపిస్తోంది. సాయంత్రం షోలకు మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. తెలుగు వెర్షన్ వాషౌట్ అవుతుందనుకుంటే ఊహించని విధంగా డీసెంట్ పికప్ ఉండటం అసలు ట్విస్ట్. పోనీ టాక్ ఫుల్ పాజిటివ్ గా మారిందా అంటే అదేం లేదు. ఇది గుర్తించిన ఉపేంద్ర వెంటనే రంగంలోకి దిగి పబ్లిసిటీ పెంచబోతున్నట్టు సమాచారం. ఆంధ్రతో మొదలుపెట్టి సక్సెస్ టూర్లు చేస్తారట. బచ్చల మల్లి, విడుదల పార్ట్ 2లు సైతం సోసో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాన్ని యుఐకి అనుకూలంగా మార్చడానికి ట్రై చేస్తున్నారు.
ఒకవేళ ఇదే సినిమాని ఇంకో హీరో, దర్శకుడు తీసి ఉంటే రెండో రోజే థియేటర్ల నుంచి తీసేసేవారనే మాటలను కొట్టిపారేయలేం. ఇక్కడ పని చేస్తోంది ఉపేంద్ర బ్రాండ్ ఒకటే. ఆయన మేకింగ్, నటన మీద అపారమైన గౌరవంతో టికెట్లు కొంటున్న వాళ్లే ఎక్కువ. బుక్ మై షోలో కన్నడ వెర్షన్ కు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర గతంలో చేసిన ఉప్పీ 2 కంటే ఇది మంచి ఫలితం అందుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేం. వర్తమాన సామజిక పరిస్థితుల మీద సెటైరిక్ మూవీ ఇవ్వాలని ప్రయత్నం చేసిన ఉపేంద్ర ఇంకొంచెం సీరియస్ గా ట్రై చేసి ఉంటే నిజంగా క్లాసిక్ వచ్చేదేమో. ఛాన్స్ మిస్.
This post was last modified on December 21, 2024 11:10 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…