సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దంగల్ అంటూ కేవలం ఖాన్ల గురించి మాత్రమే మాట్లాడుకున్న ఇండియన్ సినిమా ఇకపై పుష్ప 2 ది రూల్ తో మొదలుపెట్టనుంది. ఇప్పటిదాకా ఎవరూ సాధించలేని విధంగా 632 కోట్ల 50 లక్షల నెట్ అది కూడా కేవలం మూడు వారాల లోపే సాధించడం చూసి నార్త్ ట్రేడ్ పండితులకు నోట మాట రావడం లేదు. రిలీజ్ కు ముందు హైప్ ఉన్న సంగతి తెలుసు కానీ ఈ స్థాయిలో ఊచకోత ఎవరూ ఊహించలేదు. ఒక డబ్బింగ్ మూవీ ఇలాంటి హిస్టరీ రాస్తుందని ఎవరు చెప్పలేదు.
ఇంకా స్పీడ్ తగ్గలేదు. తిరిగి వీకెండ్ మళ్ళీ పుంజుకునేలా ఉన్న పుష్ప 2 ఇంకో పదిహేను రోజులు ఇదే దూకుడు కొనసాగిస్తుందని ఒక అంచనా. ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల దాకా లేదా అంతకన్నా ఎక్కువ దాటినా ఆశ్చర్యం లేదని దశబ్దాల తరబడి ట్రాకింగ్ చేస్తున్న విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. మరో 20 నిమిషాల ఫుటేజ్ జోడించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి కానీ అందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ఒకవేళ అది నిజమైతే మరింత మైలేజ్ పెరిగి రిపీట్ రన్స్ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల బిసి సెంటర్లలో పుష్ప 2 రికార్డులు మాములుగా లేవు. థియేటర్ ఓనర్ల గల్లాపెట్టెలు కళకళమంటున్నాయి.
ఫైనల్ గా పుష్ప 2 ది రూల్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. క్రిస్మస్ రిలీజుల్లో తొలి బ్యాచ్ లో వచ్చిన బచ్చల మల్లి, యుఐ, విడుదల పార్ట్ 2లకు ఆశించిన టాక్ రాకపోవడం ప్లస్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 25 రాబోతున్న బేబీ జాన్ ఒక్కటే పుష్ప 2కున్న స్పీడ్ బ్రేకర్. అది హిట్ టాక్ తెచ్చుకుంటే కొంత ప్రభావం చూపించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇదంతా ఎలా ఉన్నా ఇకపై హిందీ సినిమాల గురించి ప్రస్తావించే ప్రతిసారి ప్రతి చోటా పుష్ప పేరు వినిపించనుండటం అల్లు అర్జున్ కు జాతీయ అవార్డుని మించిన గొప్ప ఘనత. ఒకవేళ సీక్వెల్ కు కూడా నేషనల్ అవార్డు ఇస్తే అదింకో గొప్ప మైలురాయి.
This post was last modified on December 20, 2024 10:45 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…