థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా చివరిదాకా కూర్చుంటాం. దీనికి పివిఆర్ ఐనాక్స్ కొత్త ప్లాన్ వేసింది. ఒకవేళ మీరు వాళ్ళ మల్టీప్లెక్సు నుంచి మధ్యలో వెళ్లిపోవాలనుకుంటే అప్పటిదాకా చూసిన సమయాన్ని లెక్క వేసి మిగిలింది రీ ఫండ్ చేస్తారు. కాకపోతే ముందు టికెట్ కొనే సమయంలో అసలు రేట్ కన్నా పది శాతం అదనంగా కట్టి తీసుకోవాలి. అంటే ఉదాహరణకు 400 రూపాయలు టికెట్ అనుకుంటే 40 ఎక్స్ ట్రా పెట్టాలి. మొత్తం చూస్తే ఏం వెనక్కు ఇవ్వరు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రయోగిస్తున్నారు.
ఇదేదో బాగుందని సంబరపడేందుకు లేదు. ఎందుకంటే నగరాల్లో ముందస్తుగా సమయాన్ని ప్లాన్ వేసుకుని టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ దాకా వెళ్లినోళ్లు గుడ్డో బ్యాడో చివరి దాకా ఉంటారు. పైగా అదనంగా డబ్బు కట్టాలి కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవడమని రిస్క్ చేయరు. అలాంటప్పుడు ఇది వర్కౌట్ కాదు. ముఖ్యంగా ఫ్యామిలీస్ అసలు చేయరు. సింగల్ గా వెళ్లే మూవీ లవర్స్ కు కొంత ప్రయోజనం ఉంటుంది. ఇదంతా ఆలోచించే ప్రేక్షకుల మనస్తత్వాన్ని కాచి వడబోసి పివిఆర్ ఐనాక్స్ ఈ పథకాన్ని రూపొందించింది. ఎంతమేరకు సక్సెస్ అవుతుందో కొద్దిరోజుల దాకా వేచి చూడాలి.
జనాన్ని థియేటర్లకు రప్పించడానికి మల్టీప్లెక్సులు పడుతున్న తిప్పలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. మాములుగా పెద్ద హీరోల సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండదు కానీ మీడియం లేదా చిన్న రేంజ్ చిత్రాలకు ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. అలాంటి వాటికి ఈ రీఫండ్ స్కీం ఏదో బాగుంటుంది. అంటే ఇంటర్వెల్ కు లేచొస్తే సగం వాపస్ వస్తుంది. ఢిల్లీలో సక్సెస్ అయితే మిగిలిన చోట్ల అమలు చేయాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ముందు ముందు ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తే తప్ప మనుగడ కష్టమైన తరుణంలో వీటికి పబ్లిక్ ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on December 20, 2024 5:44 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…