ఇవాళ విడుదలైన ఉపేంద్ర యుఐకి ఊహించినట్టే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్టు సినిమా అర్థం చేసుకోవడానికి కష్టపడాలని అన్న మాటలు నిజమైనట్టు థియేటర్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు కానీ టాక్ మీద చాలా నమ్మకం పెట్టుకున్న టీమ్ కు చివరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇంకో రెండు మూడు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అయితే విచిత్రమైన ఆలోచనలు, బోల్డ్ డైలాగులతో ఆసక్తి రేపే ఉపేంద్ర ఈసారి టైటిల్ కార్డులోనే జనాలను కవ్వించే పని పెట్టుకున్నారు. అది కూడా కన్ఫ్యుజింగ్ గా ఉండటం సినిమాని మించిన ట్విస్టు.
ఉపేంద్ర రెండు సూచనలు ఇచ్చారు. ఒకటి మీరు బుద్ధిమంతులైతే తక్షణం థియేటర్ నుంచి వెళ్లిపోండి. రెండోది మీరు ఫూల్స్ అయితే సినిమా చివరి దాకా చూడండి. బాగున్నాయి కదూ. అంటే టికెట్ కొన్న ఆడియన్స్ తెలివైనవాళ్ళు అనుకుంటే సెలవు తీసుకోవాలి. లేదూ చివరి దాకా చూస్తామంటే మూర్ఖులమని ఒప్పుకున్నట్టు. భలే ఉంది కదూ. ఇది చూసిన వాళ్లకు నవ్వు రాకుండా ఉంటుందా. ఉప్పి తెలివితేటలకు చప్పట్లు కొట్టకుండా మనసు ఊరుకుంటుందా. కర్ణాటకలో యుఐ భారీ వసూళ్లతో మొదలయ్యింది. తెల్లవారుఝామున ఆరు గంటల షోల నుంచి ఫ్యాన్స్ ఓ రేంజ్ సందడి చేయడం మొదలుపెట్టారు.
పోటీ తీవ్రంగా ఉంది కనక తెలుగులో యుఐ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సామాన్యులకు దీని స్క్రీన్ ప్లే అంతగా కొరుకుడు పడని వైనం పబ్లిక్ టాక్ లో ఉంది. ఒకవేళ ఇది కనక ఆశ్చర్యకరంగా పాజిటివ్ గా మారితే హిట్టు కొట్టొచ్చు. లేదంటే కష్టమే. బచ్చల మల్లి, విడుదల పార్ట్ 2లకు సైతం యునానిమస్ రిపోర్ట్స్ లేవు. మిక్స్డ్ రియాక్షన్స్ లో ఎవరు బెటరని తేలడానికి సోమవారం దాకా ఆగాల్సి వచ్చేలా ఉంది. స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర రూపొందించిన యుఐ ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజయ్యింది. పబ్లిసిటీ మొత్తం ఆయనే ముందుండి అన్ని భాషల్లో చేసుకోవడం కూడా ఉప్పి స్టైలే.
This post was last modified on December 20, 2024 5:01 pm
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా…