బాలీవుడ్లో గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్లలో విధు వినోద్ చోప్రా ఒకడు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ లాంటి గొప్ప చిత్రాలకు ఆయన నిర్మాత. వాటి స్క్రిప్టులో కూడా ఆయన కృషి ఉంది. దర్శకుడిగా కూడా కొన్ని మంచి సినిమాలు తీశారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘ట్వల్త్ ఫెయిల్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో.. దానికి ఎన్ని పురస్కారాలు దక్కాయో తెలిసిందే. అయితే ఆయన్నుంచి తాజాగా వచ్చిన డాక్యుమెంటరీ ఫిలిం ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.
థియేటర్లలో ఈ చిత్రానికి కనీస స్పందన కూడా కరవైంది. ఐతే ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరించడానికి తనకేమీ నామోషీగా లేదని అంటున్నాడు విధు వినోద్ చోప్రా. బాలీవుడ్లో ఫేక్ కలెక్షన్లతో ఆడని సినిమాను హిట్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయిందంటూ ఈ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేశారు.
‘‘’సినిమా మార్కెటింగ్ మొత్తం అబద్ధాల మీద నడుస్తోంది. ఈ రోజుల్లో ఆడని సినిమా ఆడలేదని ఎవ్వరూ చెప్పుకోవట్లేదు. ఫేక్ కలెక్షన్లు చూపించి హిట్ అని చెప్పుకుంటున్నారు. వీళ్లే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌కు డబ్బులు ఇచ్చి సినిమా గురించి గొప్పలు చెప్పించుకుంటారు. కలెక్షన్లు లేని సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నట్లు చూపిస్తారు. కానీ థియేటర్లలో మాత్రం జనం ఉండదు. ఇటీవల నా సినిమా ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’ విడుదలైంది.
కానీ దాన్ని థియేటర్లకు వచ్చి ఎవ్వరూ చూడలేదు. ఆ విషయం నేను నిజాయితీగా అంగీకరిస్తున్నా. తమ సినిమాను ప్రేక్షకులు చూడలేదని ఎవ్వరూ నిజాయితీగా చెప్పరు. విదేశాల్లో చదువుకుంటున్న నా కూతురికి ఫోన్ చేసి నా సినిమాను జనం చూడట్లేదని చెబితే.. నేనలా చెప్పినందుకు ఆమె షాకైంది’’ అని విధు వినోద్ తెలిపారు. ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’.. ‘ట్వల్త్ ఫెయిల్’ వెనుక బ్యాగ్రౌండ్ గురించి తీసిన డాక్యుమెంటరీ ఫిలిం కావడం విశేషం.
This post was last modified on December 20, 2024 10:27 am
2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్…
హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…
సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్లోనే అలాంటి వీడియోలు…