సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్‌లోనే అలాంటి వీడియోలు అందుబాటులోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు మేకింగ్ ముచ్చట్లను కూడా ఒక డాక్యుమెంటరీగా మార్చి థియేటర్లలో రిలీజ్ చేసే ట్రెండ్ వస్తోంది. ‘బాహుబలి’ నుంచి సినిమా మార్కెటింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు ఇదే ప్రయత్నం చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి తెర వెనుక ముచ్చట్లతో ఆయన టీం ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించింది.
ఇటీవలే దీని ట్రైలర్ కూడా రిలీజైంది. అది ఆసక్తికరంగానే అనిపించింది. ఐతే ఇది ఏదైనా ఓటీటీ లేదా యూట్యూబ్ ద్వారా రిలీజవుతుందేమో అనుకుంటే.. థియేట్రికల్ రిలీజ్ అని చెప్పి షాకిచ్చారు. ఇవాల్టి నుంచే ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ థియేటర్లలో ప్రదర్శితం కానుంది. బుక్ మై షోలో దీని టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. టికెట్ల ధరలు రూ.200 నుంచి 300 వరకు ఉన్నాయి. గంటా 38 నిమిషాల నిడివితో ఈ డాక్యుమెంటరీ రిలీజవుతోంది. ఐతే ఇలాంటి తెర వెనుక ముచ్చట్లను ఫ్రీగా యూట్యూబ్‌లో చూడమంటే ఓకే కానీ.. థియేటర్లకు వెళ్లి డబ్బులు పెట్టి మరీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారా అన్నది సందేహం.
ప్రతిదాన్నీ మార్కెట్ చేయాలని, క్యాష్ చేసుకోవాలని చూడడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ రూ.1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ డాక్యుమెంటరీకి బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. రేప్పొద్దున ఏదో ఒక ఓటీటీలో ఈ డాక్యుమెంటరీ రిలీజైనపుడు చూసుకుందాం అని జనాలు లైట్ తీసుకునే పరిస్థితే కనిపిస్తోంది.
This post was last modified on December 20, 2024 9:44 am
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…