టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ఉన్న బిజీలో మీడియం రేంజ్ వాటి మీద దృష్టి పెట్టడం కష్టమే. మిక్కీ జె మేయర్ విదేశాల్లో ఉంటాడు. అనూప్ రూబెన్స్ ఫామ్ తగ్గిపోయింది. మణిశర్మ మేజిక్ పని చేయడం లేదు. అనిరుధ్ రవిచందర్ సరేసరి. పది కోట్లు ఇచ్చినా సులభంగా దొరికే పరిస్థితి లేదు. అందుకే పక్కబాషల నుంచి జివి ప్రకాష్ కుమార్, హరీష్ జైరాజ్, సంతోష్ నారాయణన్, హేశం అబ్దుల్ వహాబ్ లాంటి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో భీమ్స్ లాంటివాళ్ళు ఆశాకిరణం అవుతున్నారు.
తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంకి అతనిచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్ లు అయిపోయాయి. ఈ మధ్యకాలంలో ఇంత వేగంగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న సాంగ్స్ ఇవే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లకు ఈ స్థాయి స్పందన తక్కువ టైంలో రాలేదన్నది వాస్తవం. రమణ గోగులతో గోదారి గట్టుని పాడించడం ఓ రేంజ్ లో పేలింది. మెలోడీ మాస్ మిక్స్ చేస్తూ కంపోజ్ చేసిన మీను మీను కూడా వెంటనే ఎక్కేస్తోంది. అనిల్ రావిపూడి టేకింగ్ కి తోడు వెంకీకి జంటగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చేసిన అల్లరి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మిగిలిన పాటలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని ప్రీ టాక్.
ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ మ్యాడ్ ఒక్కటే. టిల్లు స్క్వేర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. దేవకీనందన వాసుదేవ, విశ్వం లాంటివి అంతగా వర్కౌట్ కాలేదు కానీ నెక్స్ట్ రాబోయే రవితేజ మాస్ జాతర, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైసన్ నాయుడు, అడవి శేష్ డెకాయిట్ లాంటి పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తరహా పనితనం ఇకపై కూడా కొనసాగిస్తే భీమ్స్ కు తిరుగు ఉండదు. 2012లో నువ్వా నేనాతో ఇండస్ట్రీకి వచ్చిన భీమ్స్ సిసిరోలియోకి ఇన్నేళ్లకు బ్రేక్ దొరుకుతోంది. దాన్ని నిలబెట్టుకోవడమే కావాల్సింది. అందులో భాగంగా 2025 కీలకం కానుంది.
This post was last modified on December 20, 2024 7:09 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…