బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2 ది రూల్ మూడో వారంలో అడుగు పెట్టినా నెమ్మదించలేదు. ముఖ్యంగా నార్త్ లో దీని స్పీడ్ మాములుగా లేదు. సాధారణంగా హిందీలో ఏ సినిమాకైనా హిట్ టాక్ వస్తే దాని రన్ కనీసం నలభై రోజుల దాకా ఉంటుంది. స్త్రీ 2, పఠాన్ లాంటి వాటికి ఇదే జరిగింది. మరి షారుఖ్ ఖాన్ జవాన్ నే దాటేసిన పుష్ప 2కి ఇంకే స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. అందుకే జనవరి మొదటి వారం దాకా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి టైంలో డిసెంబర్ 25న బేబీ జాన్ వస్తోంది.
వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా అట్లీ నిర్మించిన ఈ తేరి రీమేక్ కి కలీస్ దర్శకత్వం వహించాడు. ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే పుష్ప 2 హ్యాంగోవర్ లో ఉన్న ఉత్తరాది ప్రేక్షకులకు ఈ రొటీన్ పోలీస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఏ మేరకు ఎక్కుతుందనే అనుమానాలు ఎగ్జిబిటర్లలో లేకపోలేదు. ఎందుకంటే తేరి తమిళంలో బ్లాక్ బస్టర్. అది కూడా విజయ్ ఇమేజ్, ఎలివేషన్ల వల్ల ఆడింది. తెలుగు డబ్బింగ్ సూపర్ ఫ్లాప్. వరుణ్ ధావన్ కు అంత బ్రాండ్, మార్కెట్ లేదు. అలాంటప్పుడు మెప్పించడం మాములు సవాల్ కాదు.
అయినా సరే పుష్ప 2, బేబీ జాన్ మధ్య మూడు వారాల గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తమ సినిమాని ఆదరిస్తారని అట్లీ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ క్యామియోని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు కానీ అదేమీ విపరీతంగా పని చేయడం లేదు. ఎందుకంటే కండలవీరుడి గెస్టు పాత్రలు చాలా సందర్భాల్లో ఫ్లాపులే ఇచ్చాయి. సో బేబీ జాన్ ఈ ప్రతికూలతలన్నీ దాటాలి. తమన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో వామికా గబ్బి, జాకీ శ్రోఫ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. బడ్జెట్ అయితే భారీగా ఖర్చు పెట్టారు. దర్శకుడిని హైలైట్ చేయకుండా నిర్మాత బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్న సినిమా ఇదే.
This post was last modified on December 19, 2024 2:29 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…