Movie News

సిద్ధు ఫిక్సయ్యాడంటే… ప్రభాస్ తప్పుకున్నట్లేనా?

ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ఆ సినిమా వాయిదా అంటూ కొన్ని రోజుల కిందట మొదలైన ప్రచారం వారిని కలవర పెట్టింది. ముందు ఇది జస్ట్ రూమరే అనుకున్నారు కానీ.. ఇప్పుడు అదే నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న ‘జాక్’ సినిమా కోసం ఏప్రిల్ 10నే రిలీజ్ డేట్‌గా ఎంచుకోవడంతో ప్రభాస్ సినిమా వాయిదాపై ఒక క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది.

‘రాజాసాబ్’ను అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం చాలా టైం పట్టేలా ఉండడంతో ఆ డేట్‌ను ‘రాజా సాబ్’ అందుకోవడం కష్టమని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా రావడం, రాకపోవడాన్ని బట్టి చాలా సినిమాల లెక్కలు మారిపోతాయి కాబట్టి ఇండస్ట్రీ జనాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపిస్తోంది. మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ను ఏప్రిల్ 25కు ఫిక్స్ చేసినపుడే ‘రాజా సాబ్’ ఆగమనంపై సందేహాలు కలిగాయి.

కేవలం రెండు వారాల గ్యాప్‌లో ప్రభాస్ నటించిన మరో సినిమాను పోటీలో నిలబెడతారా అనే ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు ప్రభాస్ స్నేహితులైన యువి క్రియేషన్స్ అధినేతలు ప్రొడ్యూస్ చేస్తున్న అనుష్క సినిమా ‘ఘాటి’ని ఏప్రిల్ 18కి కన్ఫమ్ చేసినపుడు ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు డేట్ ప్రకటించగానే ‘రాజా సాబ్’ వాయిదా ఖరరిపోయినట్లుగా అర్ధం అవుతుంది.

ఈ చిత్రాన్ని వేసవి చివర్లో కానీ.. లేదా ‘కల్కి’ని రిలీజ్ చేసినట్లే జూన్‌లో కానీ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇది హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతోంది.

This post was last modified on December 18, 2024 3:43 pm

Share

Recent Posts

నాని తీయాలనుకున్న ‘24’ సినిమా

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో టైర్-2లో టాప్ హీరో. ‘ది ప్యారడైజ్’ సినిమా అంచనాలను అందుకుంటే.. అతను టైర్1…

55 minutes ago

ప్యారడైజ్ డే-1 ఎంత?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ…

2 hours ago

తెలంగాణ పోలీసుల ‘ఇరుముడి’ పాట చూశారా?

సినిమా అనేది అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. మంచైనా, చెడైనా జనాల్లోకి చాలా వేగంగా తీసుకువెళ్లే మీడియం ఇది. దీన్ని మంచి…

6 hours ago

నిమ్స్ డాక్టర్ ఆస్తులు 80 కోట్లా?

ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు…

9 hours ago

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

10 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

11 hours ago