ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్‌తో గొడవ నేపథ్యంలో వీరి గురించి చాలా చర్చ జరిగింది. ధనుష్ ఫ్యాన్స్ నుంచి ఇద్దరూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అది చాలదని ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్‌కు దారి తీశాయి. తాను ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ఎంతవాడు గాని)కు గౌతమ్ మీనన్ దగ్గర పని చేస్తున్న సమయంలో అజిత్‌తో మాట్లాడానని.. ఆయనకు తన సినిమా ‘నానుం రౌడీ దా’ బాగా నచ్చి, తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని ఆ ఇంటర్వ్యూలో విఘ్నేష్ వెల్లడించాడు.
కానీ ‘నానుం రౌడీ దా’.. ‘ఎన్నై అరిందాల్’ రిలీజైన ఆరు నెలల తర్వాతే విడుదలైంది. దీంతో రిలీజ్ కాని సినిమాను చూసి అజిత్ ఇంప్రెస్ అయ్యాడా అంటూ విఘ్నేష్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఈ ట్రోల్స్ విషయంలో విఘ్నేష్ బాగానే హర్టయినట్లున్నాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తనను వెక్కిరించడం ఆపాలని అతను విజ్ఞప్తి చేశాడు.
‘‘ఎన్నై అరిందాల్ సమయం నుంచి నాకు అజిత్ తెలుసు. ఆ సినిమా కోసం గౌతమ్ మీనన్ పాట రాయమని అడిగితే రాసిచ్చా. అప్పుడే అజిత్‌తో నాకు పరిచయం జరిగింది. నేను డైరెక్ట్ చేసిన ‘నానుం రౌడీ దా’ రిలీజయ్యాక ఆయనతో మాట్లాడా. విశ్వాసం షూటింగ్ టైంలో అజిత్ హైదరాబాద్‌లో ఉన్నపుడు కలిశా. నానుం రౌడీ దా చూశానని, చాలా బాగుందని ఆయన అన్నారు. ఇది నిజం.
మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పడానికి సమయం లేకపోయింది. నేను వేరే దర్శకులతో కలిసి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అంత మంది ఉన్నపుడు ప్రతి విషయాన్నీ పూర్తిగా వివరిస్తూ ఎక్కువ టైం తీసుకోలేం. అందుకే ఆ రోజు సరిగా, వివరంగా విషయం చెప్పలేకపోయాను. ఇకనైనా నన్ను ఎగతాళి చేయడం ఆపండి’’ అని విఘ్నేష్ అన్నాడు.
This post was last modified on December 18, 2024 2:16 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…