కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రికార్డులు సాధించిన సినిమాలు తీరా ఓటిటిలో వచ్చాక ఆశించిన స్పందన తెచ్చుకోలేక నీరసపడతాయి. కల్కి 2898 ఏడి వెయ్యి కోట్లు సాధించినా సరే డిజిటల్ లో మాత్రం అద్భుతాలు చేయలేదు. కానీ లక్కీ భాస్కర్ మాత్రం పేరుకు తగ్గట్టే అదృష్టాన్ని వెంటేసుకుని నెట్ ఫ్లిక్స్ లోనూ దూసుకుపోతోంది. మూడు వారాల క్రితం స్ట్రీమింగ్ మొదలుపెట్టిన దుల్కర్ సల్మాన్ మూవీ ఇప్పటిదాకా 14.9 మిలియన్ల వ్యూస్ సాధించింది. సెకండ్ వీక్ లోనే దేవరను మూడో స్థానానికి నెట్టేసి సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాల్లో అత్యధిక శాతం చూసిన సినిమాగా కొత్త రికార్డు నమోదు చేసింది.
డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 15 దాకా తీసుకున్న డేటా ప్రకారం లక్కీ భాస్కర్ ప్రస్తుతం గ్లోబల్ స్పాట్ లో అయిదవ స్థానంలో ఉంది. నాన్ ఇంగ్లీష్ కంటెంట్ లోని ర్యాంక్ ఇది. ఇప్పటిదాకా అత్యధిక వ్యూస్ ఉన్న వాటిలో మహారాజా 19.7 మిలియన్ల వ్యూస్ తో అగ్రస్థానంలో ఉండగా నెక్స్ట్ ప్లేస్ దక్కించుకుంది లక్కీ భాస్కరే. దేవర 9 మిలియన్లతో కొనసాగుతుండగా, కల్కి హిందీ 8 మిలియన్లు, ఇండియన్ టూ 6.8 మిలియన్లతో ఉన్నాయి. సో ప్యాన్ ఇండియా మూవీస్ కన్నా ఎక్కువ ఆదరణ లక్కీ భాస్కర్ దక్కించుకోవడం విశేషం. దెబ్బకు దుల్కర్ సల్మాన్ ఇంతకు ముందు నటించిన సినిమాలకూ డిమాండ్ వస్తోందట.
ఇదంతా దర్శకుడు వెంకీ అట్లూరి బ్రాండ్ ని పెంచేదే. ప్రస్తుతం సూర్యతో ఓకే చేయించుకునే పనిలో ఉన్న ఈ యువ దర్శకుడు తర్వాత మోక్షజ్ఞతో కూడా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇవి సితార సంస్థ భాగస్వామ్యంలోనే ఉండొచ్చు. ఒరిజినల్ మలయాళం మార్కెట్ ని వదిలేసి ఎక్కువ తెలుగు అవకాశాల మీద దృష్టి పెట్టిన దుల్కర్ సల్మాన్ దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంటున్నాడు, నిర్మాణంలో ఉన్న ఆకాశంలో ఒక తారకు అప్పుడే క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. రానా నిర్మాణంలో కాంతా ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇంకో రెండు హిట్లు పడితే దుల్కర్ టాలీవుడ్ లో సెటిలైపోయేలా ఉన్నాడు.
This post was last modified on December 18, 2024 11:38 am
అల్లరి నరేష్ కెరీర్లో అతి పెద్ద హిట్.. సుడిగాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తమిళ్ పడం’ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. తెలుగు…
ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్తో గొడవ నేపథ్యంలో వీరి గురించి…
ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర…
తెలంగాణలో చిత్రమైన రాజకీయం తెరమీదికి వచ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.…
వైసీపీ అధినేత జగన్ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 4…
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు అనంతరం అశ్విన్ రిటైర్మెంట్…