రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి అయినా, తన వ్యక్తిగత విషయాల మీదైనా దేశవ్యాప్తంగా అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. ఇటీవల ప్రభాస్ షూటింగ్‌లో గాయపడ్డట్లు వార్తలు వచ్చాయి. అవి జస్ట్ రూమర్లని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ స్వయంగా గాయం గురించి ధ్రువీకరించడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మామూలుగా ఇలాంటి విషయాల్లో ప్రభాస్ అప్‌డేట్స్ ఏమీ ఇవ్వడు. కానీ వచ్చే నెలలో జపాన్‌లో కల్కి సినిమా భారీగా రిలీజవుతున్న నేపథ్యంలో అక్కడికి టీంతో వెళ్లి ప్రమోట్ చేయాలని ప్రభాస్ అనుకున్నాడు.
కానీ గాయం వల్ల వెళ్లలేని పరిస్థితి. దీంతో జపాన్‌లో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సారీ చెబుతూ.. తాను అక్కడికి రాలేకపోతున్న విషయాన్ని వెల్లడించాడు. షూట్‌లో చిన్న గాయం కావడం వల్ల తాను రాలేకపోతున్నట్లు వెల్లడించాడు. ఐతే జపాన్ పర్యటనను రద్దు చేసుకునేంత పెద్ద గాయం అయిందా అని అభిమానులు కలవరపడుతున్నారు. ఐతే ప్రభాస్ టీం చెబుతున్న దాని ప్రకారం జరిగింది చిన్న ప్రమాదమే, కాలికి అయిన గాయం కూడా చిన్నదే. కానీ కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం.
దీంతో ఎక్కడికీ వెళ్లలేని పరస్థితి. ఒక రెండు వారాలైనా విశ్రాంతి తీసుకోక తప్పదట. దీంతో ఈ నెలలో జరగాల్సిన ఫౌజీ (వర్కింగ్ టైటిల్) షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. ఈ సినిమా షూట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా రాజా సాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఆ సినిమా షూట్ చివరి దశకు వచ్చింది.
ప్రస్తుత బ్రేక్ వల్ల రాజాసాబ్ కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. మే నెలాఖరుకు వాయిదాపడొచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రాజాసాబ్ డేట్ ప్రకటించాక కూడా కన్నప్ప, ఘాటి చిత్రాలను దగ్గర్లో రిలీజ్‌కు సిద్ధం చేయడం చూస్తేనే రాజాసాబ్ అనుకున్న డేట్‌కు రాదనే సంకేతాలు వచ్చేశాయి.
This post was last modified on December 17, 2024 10:52 am
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…