Movie News

‘బరోజ్’కి ఉపయోగపడిన జనతా గ్యారేజ్ లింకు!

క్రిస్మస్ పండక్కు చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి. నితిన్ రాబిన్ హుడ్ తప్పుకున్నప్పటికీ కౌంట్ పెద్దగా తగ్గలేదు. పుష్ప 2 ది రూల్ పూర్తిగా నెమ్మదించకపోయినా సంక్రాంతికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నవన్నీ డిసెంబర్ మూడో వారంలోనే తాడోపేడో తేల్చుకోబోతున్నాయి. వీటిలో అల్లరి నరేష్ బచ్చల మల్లి ఒక్కటే టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడం గమనార్హం. మిగిలినవన్నీ డబ్బింగ్ బాపతే. ఉపేంద్ర యుఐ కోసం హైదరాబాద్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు ఇచ్చాడు. విడుదల పార్ట్ 2 కోసం విజయ్ సేతుపతి నిన్నంతా భాగ్యనగరంలోనే గడిపాడు. మ్యాక్స్ కోసం సుదీప్ రాబోతున్నాడు.

ఇవన్నీ ఓకే కానీ మోహన్ లాల్ బరోజ్ 3డి కూడా డిసెంబర్ 25 రానున్న సంగతి ఇంకా తెలుగు జనాలకు రిజిస్టర్ కాలేదు. మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. దర్శకత్వం కూడా ఆయనే చేశారు. సుదీర్ఘమైన పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు మోక్షం దక్కుతోంది. అయితే ఇక్కడ బజ్ తో పాటు సరైన డిస్ట్రిబ్యూషన్ అవసరమైన నేపథ్యంలో మోహన్ లాల్ కు అండగా మైత్రి మూవీ మేకర్స్ నిలుస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ బ్యానర్ రెండో మూవీ జనతా గ్యారేజ్ లో లాలెట్టన్ ప్రధాన పాత్ర పోషించి విజయంలో భాగం వహించిన సంగతి తెలిసిందే.

దాన్ని దృష్టిలో ఉంచుకునే బరోజ్ బాధ్యతలను మైత్రి తీసుకుందని సమాచారం. ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే కంటెంట్ భారీగానే కనిపిస్తోంది. నున్నటి గుండు, బారెడు గెడ్డంతో మోహన్ లాల్ వెరైటీగా కనిపిస్తుండగా పూర్తి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో బరోజ్ రూపొందింది. బెస్ట్ త్రీడి ఎక్స్ పీరియన్స్ ఇస్తామని టీమ్ హామీ ఇస్తోంది. గుప్త నిధులు, మాయలు మర్మాలు చుట్టూ తిరిగే బరోజ్ లో చైల్డ్ సెంటిమెంట్ కూడా ఉంది. 400 సంవత్సరాల క్రితం డిగామా దాచిపెట్టిన ట్రెజరీ సంరక్షకుడిగా మోహన్ లాల్ వైవిధ్యమైన పాత్ర చేశారు. మరి ఇంత కాంపిటీషన్ లో బరోజ్ ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. ప్రీమియర్లు వేసే ఆలోచన జరుగుతోంది.

This post was last modified on December 17, 2024 10:22 am

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

6 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago