సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. ‘ఏ’తో దాన్ని ముప్పై సంవత్సరాల క్రితమే ఋజువు చేయడం ఎవరూ మర్చిపోలేరు. అలాంటి విలక్షణ దర్శకుడి నుంచి కొత్త ప్యాన్ ఇండియా మూవీ యుఐ డిసెంబర్ 20న థియేటర్లలో అడుగు పెట్టనుంది. దీని ప్రమోషన్ కోసం నిన్న హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర చాలా కబుర్లు పంచుకున్నాడు కానీ ఆయన చెప్పిన విషయాలన్నీ క్రోడీకరించుకుంటే థియేటర్లో చూపించేది సినిమానా లేక ఏదైనా మెదడుకి పరీక్ష పెడతారా అనే అనుమానం కలగకమానదు. అంత లోతుగా క్లూస్ ఇచ్చారు మరి.
ప్రభాస్ కల్కి మైథలాజికల్ అయితే మాది సైకలాజికల్ అని చెబుతున్న ఉపేంద్ర టైటిల్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు వస్తుంటాయాని, వాటిలో డీ కోడ్ చేసుకుంటే అసలైన మజా దక్కతుందని ఊరిస్తున్నాడు. నిజానికి ప్రేక్షకుడు హాల్లోకి వచ్చాక మెదడుకి పెద్దగా పని చెప్పడు. కాలక్షేపం జరగాలని కోరుకుంటాడు. ఇచ్చిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగితే చాలు. తన ఇంటెలిజెన్స్ మీద బరువు పెడితే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మహేష్ బాబు 1 నేనొక్కడినేకి దర్శకుడు సుకుమార్ చేసిన పొరపాటు ఇదే. మరి ఉపేంద్ర ఎలంటి జాగ్రత్తలు తీసుకున్నారో.
2015లో ఆయన ఉప్పి 2 తీశారు. భారీ అంచనాల మధ్య ఫ్లాప్ అయ్యింది. స్క్రీన్ ప్లే అర్థం కాకపోవడం వల్లే జనం తిరస్కరించారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. పలు ఇంటర్వ్యూలలో ఉపేంద్ర దీని గురించి వివరించే ప్రయత్నం చేశారు కానీ లాభం లేకపోయింది. అంతకన్నా టిపికల్ సబ్జెక్టుతో వస్తున్న యుఐలో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇన్ సైడ్ టాక్. కొన్ని వివాదాలకు దారి తీసే అవకాశాలు లేకపోలేదట. అవేంటో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే. విజువల్స్ వీలైనంత ఎక్కువగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డ ఉపేంద్ర స్క్రీన్ మీద ఏమేం షాకులు ఇస్తారో.
This post was last modified on December 16, 2024 7:08 pm
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను…