మొన్నటి ఏడాది ఒకే సమయంలో మూడు నాలుగు షూటింగుల్లో పాల్గొంటూ కనీసం ప్రమోషన్లకు టైం లేనంత బిజీగా ఉన్న శ్రీలీల గుంటూరు కారం తర్వాత బ్రేక్ తీసుకుంది. ఎంబిబిఎస్ పరీక్షల కోసం కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేదు. కట్ చేస్తే తిరిగి తన డైరీ ఇంకో రెండేళ్లు సులభంగా దొరకలేంత బిజీగా మారుతోంది. ఇటీవలే పుష్ప 2లో కిసిక్ కిసిక్ అంటూ కుర్రకారుకు మత్తెక్కించాక ఉత్తరాది ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడటం లాంఛనమే కాబట్టి 2024లో తన నుంచి వచ్చిన రిలీజ్ గుంటూరు కారం ఒక్కటే. బన్నీతో చేసింది స్పెషల్ సాంగ్ కాబట్టి అది కౌంట్ చేయలేం.
ఇక వచ్చే ఏడాది మాత్రం మాములుగా బిజీగా ఉండేలా కనిపించడం లేదు. జనవరిలో రాబిన్ హుడ్ రిలీజవుతుంది. మే 9న రవితేజ మాస్ జాతరతో మరోసారి ధమాకా మేజిక్ ని రిపీట్ చేస్తాననే నమ్మకంతో ఉంది. శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో రూపొందబోయే సోషల్ డ్రామాలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. నిన్న మొదలైన అఖిల్ 6లో అక్కినేని మనవడికి మెయిన్ లీడ్ శ్రీలీలనే. నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు కాంబోలో తెరకెక్కబోయే మిస్టరీ థ్రిల్లర్ దాదాపు తనకే ఒకే అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీ స్టార్ట్ కావడం ఆలస్యం పవన్ కళ్యాణ్ తో చేరాల్సి ఉంటుంది.
ఇవి కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి జంటగా గతంలో అనగనగా ఒక రోజుకి ఎస్ చెప్పింది. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయాక దాన్ని వేరే దర్శకుడితో తీసేందుకు సితార సంస్థ ప్లానింగ్ లో ఉంది. సిద్ధూ జొన్నలగడ్డ ప్యాన్ ఇండియా మూవీ కోహినూర్ లోనూ తనే ఉందట. గతంలో టిల్లు స్క్వేర్ లో మిస్ అయిన ఛాన్స్ ఈ విధంగా వాడుకోబోతోందన్న మాట. ఇంకా సెట్స్ పైకి వెళ్ళని వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. చూస్తుంటే 2023 కన్నా ఎక్కువ బిజీ శ్రీలీల 2025లో కానుంది. అరడజను ఆఫర్లతో ఇంత బిజీగా ఉన్న వాళ్లలో రష్మిక మందన్న తర్వాత శ్రీలీలనే.
This post was last modified on December 16, 2024 5:05 pm
మంచు కుటుంబ గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ వివాదంలో తాను కూడా భాగం అయినప్పటికీ…
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ…
‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజై పది రోజులు దాటిపోయింది. ఈ తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వీక్…
అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అని కొత్త సామెత రాయలేమో. మహేష్ బాబు ఫ్యాన్స్ తీరు చూస్తుంటే అలాగే…
వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఆ పార్టీ మంత్రులు, నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి…
తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీవల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయ గర్భగుడిలోకి ఇళయరాజా వెళ్తుండగా అర్చకులు అడ్డుకున్న వీడియో మీద సోషల్ మీడియాలో పెద్ద…