తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీవల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయ గర్భగుడిలోకి ఇళయరాజా వెళ్తుండగా అర్చకులు అడ్డుకున్న వీడియో మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. వెయ్యికి పైగా సినిమాలతో ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన సంగీత దిగ్గజానికి అవమానం జరిగిందనే రీతిలో అభిమానులు బాధ పడ్డారు. గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధమండపంలోకి రాజా వెళ్లేందుకు ప్రయత్నించడమే ఈ ఘటనకు కారణమయ్యింది. అయితే పూర్తి విషయం తెలియక వివాదం పట్ల రకరకాల అపార్థాలు వస్తున్న నేపథ్యంలో దేవస్థానం బోర్డు సిబ్బంది అసలేం జరిగిందో వివరించింది.
ఆలయ నియమ నిబంధనల ప్రకారం కేవలం జీయర్లు మాత్రమే అర్ధమండపంలోకి ప్రవేశించాలని, అది తెలియకుండా ఇళయరాజా వెళ్లేందుకు చూడటం వల్ల ఆపాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఇలాంటి నియమాలు అన్ని గుడుల్లో ఉంటాయి. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం ఇలా ఏ పుణ్యక్షేత్రం తీసుకున్నా సెలబ్రిటీలు సైతం ఒక పరిమితి వరకే దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళగలరు తప్పించి అంతకు మించి కాదు. అదే విధంగా ఆండాళ్ గుడిలోనూ ఇలాంటివి ఉండటం వల్ల రాజాకి ఇబ్బంది కలిగింది. విషయం తెలిశాక ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి చోటికి వెళ్ళినప్పుడు ముందు అక్కడి ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం అవసరం. లేదంటే లేనిపోని చిక్కులు తలెత్తుతాయి. ఆ మధ్య తిరుమల మాడ వీధుల్లో కొందరు ఫోటో షూట్లు చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగాయి. కేసులకు దారి తీశాయి. డిసెంబర్ 20 రిలీజ్ కాబోతున్న విడుదల పార్ట్ 2కి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. పావురమా పావురమా ఇప్పటికే ఆయన వింటేజ్ స్టైల్ లో సాగి ఛార్ట్ బస్టర్ అయ్యింది. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ నక్సలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కు వెట్రిమారన్ దర్శకుడు కావడం అంచనాలు పెంచుతోంది.
This post was last modified on December 16, 2024 2:36 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…