Movie News

కపిల్ కోతి ప్రశ్న….అట్లీ అదిరిపోయే సమాధానం!

రాజమౌళి, సుకుమార్ తర్వాత ఒక సౌత్ దర్శకుడు బాలీవుడ్ లో బలమైన జెండా పాతింది అంటే అట్లీనే. షారుఖ్ ఖాన్ కు బ్లాక్ బస్టర్లు అవసరమైన టైంలో జవాన్ రూపంలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సక్సెస్ ఇవ్వడం తనకే చెల్లింది. ఏకంగా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లే తనతో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఏ స్థాయిలో బ్రాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తన నిర్మాణంలో తేరి రీమేక్ ని హిందీలో కలీస్ దర్శకత్వంలో చేయించిన అట్లీ ఇటీవలే కపిల్ శర్మ కామెడీ షోకు హీరో హీరోయిన్లతో పాటు గెస్టుగా వెళ్ళాడు. మాములుగా కపిల్ అప్పుడప్పుడు చూపించే పైత్యం మనకు తెలిసిందే. ఇక్కడా అదే జరిగింది.

ఏ ఉద్దేశంతో అడిగాడో కానీ కపిల్ శర్మ ప్రశ్న ఇలా సాగింది. ” మీరు ఇప్పుడు పెద్ద దర్శకుడిగా మారారు, మీకు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఒక స్టార్ హీరోని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంతకీ అట్లీ ఎక్కడా అని ఎవరైనా అడిగారా”. ఇది సదరు కపిల్ మాటల్లోని ఒకరకమైన వెటకారం. దాన్ని అర్థం చేసుకున్న అట్లీ హుందాగా బదులు చెప్పాడు. “నేను ఏఆర్ మురుగదాస్ కి కృతజ్ఞుడై ఉంటాను. ఎందుకంటే నా రూపం, వయసు చూడకుండా మొదటి సినిమా రాజా రాణి నిర్మించింది ఆయనే. స్క్రిప్ట్ అడిగారు తప్పించి నేనెలా ఉన్నది చూడలేదు. హృదయంతో మనుషులను జడ్జ్ చేయడమంటే అది”.

అప్పటిదాకా ఈ సంభాషణను నవ్వుతూ చూస్తున్న అందరూ ఒక్కసారిగా చప్పట్లతో అట్లీకి మద్దతు తెలిపారు. కపిల్ శర్మ కావాలనే ఈ క్వశ్చన్ అడిగినా దాన్ని హ్యాండిల్ చేసిన తీరు అట్లీ మెచ్యూరిటీని చూపిస్తుంది. బేబీ జాన్ ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్న ఈ యువ దర్శకుడు సినిమాకు తాను డైరెక్టర్ కాకపోయినా ప్రొడ్యూసర్ గా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. తేరితో పోల్చుకుంటే బేబీ జాన్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ ని మరింత లోతుగా డిజైన్ చేశారు. డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ కీర్తి సురేష్ కి బాలీవుడ్ డెబ్యూ.

This post was last modified on December 16, 2024 12:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

3 minutes ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

1 hour ago

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…

1 hour ago

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…

2 hours ago

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

2 hours ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

2 hours ago