ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ బజ్ పరంగా వెనుకబడి ఉందనే మెగా ఫ్యాన్స్ అసంతృప్తికి అనుగుణంగా స్పీడ్ పెంచబోతున్నారు. డిసెంబర్ 21 యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న మొదటి ఇండియన్ మూవీగా నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి అభిమానుల కోసం హైదరాబాద్ లో ఇదే నెల 28 ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. వీటికి పునాదిగా అన్నట్టు నిన్న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా వెళ్లడం ఆసక్తి రేపింది.
ఇందులో చరణ్ కొన్ని ముఖ్యమైన సంగతులు పంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ జరుగుతున్నప్పుడు దర్శకుడు శంకర్ నుంచి ఫోన్ వచ్చింది. రాజమౌళి తర్వాత ఎవరితో చేయాలనే ఆలోచనలో ఉన్న మెగా పవర్ స్టార్ కు ఒక్కసారిగా ఆనందం రెట్టింపైపోయి ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. ఒకప్పటి వింటేజ్ శంకర్ పొలిటికల్ మూవీస్ లో చూసిన ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయని, ఖచ్చితంగా నిరాశ పరచమని రామ్ చరణ్ గట్టి హామీ ఇవ్వడంతో ప్రాంగణం చప్పట్లతో హోరెత్తిపోయింది. సో గేమ్ ఛేంజర్ కు ఫౌండేషన్ రాజమౌళి షూటింగ్ లో పడిందన్న మాట.
ఇదింకా ప్రారంభమే కాబట్టి రాబోయే రోజుల్లో గేమ్ ఛేంజర్ కు సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు. ఇదే సమయంలో మరోచోట జరుగుతున్న ఉపేంద్ర యువి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్సి 16 దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నానని, చరణ్ చితక్కొడుతున్నాడని చెప్పిన వీడియో వైరలవుతోంది. మొత్తానికి ఒకే సాయంత్రం రెండు క్రేజీ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే. ఉదయం చిరంజీవిని మధ్యాహ్నం నాగబాబుని అల్లు అర్జున్ కలిసిన కాసేపటికే గేమ్ ఛేంజర్, ఆర్సి 16 తాలూకు అప్డేట్స్ వాళ్ళను సంతోషపరిచాయి. త్వరలోనే ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి.
This post was last modified on December 16, 2024 11:30 am
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…