Movie News

చరణ్ చేతుల మీదుగా.. టైటిల్ అందుకునేదెవరు?

తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో.. బిగ్ బాస్. ఏడు సీజన్ల పాటు అపూర్వ ఆదరణ దక్కించుకున్న ఈ షో.. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌తోనూ అలరిస్తోంది. ఈసారి టైటిల్ కోసం గట్టి పోటీనే నెలకొంది. ఉత్కంఠ మధ్య ఐదుగురు ఫైనల్‌కు అర్హత సాధించారు. వాళ్లే.. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, ప్రేరణ. వీరిలో ఎవరు విజేత అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం పోటీ ప్రధానంగా గౌతమ్, నిఖిల్‌ల మధ్యే అని తెలుస్తోంది.

అవినాష్ ఐదో స్థానంతో బిగ్ బాస్-8ను ముగించినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రేరణ నాలుగో స్థానంతో షోను ముగించినట్లు సమాచారం. టైటిల్ కోసం నిఖిల్, గౌతమ్, నబీల్‌ల మధ్య పోటీ ఉండబోతోంది. వీరిలో విజేత ఎవరనే విషయంలో సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కొందరేమో గౌతమే విజేత అంటే.. కొందరు నిఖిల్‌కు టైటిల్ ఫిక్స్ అంటున్నారు. నబీల్ నుంచి కూడా గట్ట పోటీ ఉన్నప్పటికీ మిగతా ఇద్దరిలోనే ఒకరు విజేత కావచ్చని ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.

విజేతకు ట్రోఫీ ఇచ్చే అతిథి ఎవరన్నది కూడా ఫిక్సయిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్న ఫొటోలు కూడా బయటికి వచ్చేశాయి. అయ్యప్ప మాల ధరించిన చరణ్.. ఆ లుక్‌లోనే విజేతకు ట్రోఫీ ఇవ్వబోతున్నాడు. ఇంతకుముందు ఓ సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేసి విజేతకు ట్రోఫీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అప్పుడు చిరు-నాగ్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నాగ్ ఈ ఎపిసోడ్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. ఫైనల్ విజేతను తేల్చే షూట్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. కాబట్టి ఎపిసోడ్ ప్రసారానికి ముందే విజేత ఎవరన్నది బయటికి వచ్చేయొచ్చు.

This post was last modified on December 15, 2024 6:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సీఎం కావాల‌నుంది… త్రిష సంచ‌ల‌న స్టేట్మెంట్

హీరోయిన్లు రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆకాంక్ష‌ను వెల్ల‌డించ‌డం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న ద‌శ‌లో ఆ రంగంలోకి అడుగు పెట్ట‌డం…

2 hours ago

భ‌క్తుల‌కు చేరువ‌గా చైర్మ‌న్‌.. టీటీడీ ప్ర‌క్షాళ‌న!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప్ర‌క్షాళ‌న కొన‌సాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భ‌క్తుల‌కు-భ‌గ‌వంతుడికి మ‌ధ్య టీటీడీ బోర్డు ఉంటుంది.…

3 hours ago

చిరు పవన్ మధ్య కపూర్ ప్రస్తావన… ఎందుకంటే

నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం…

4 hours ago

దేవి వాహ్…చైతు & సాయిపల్లవి వారెవ్వా

నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తండేల్ నుంచి నిన్న ఓం నమః శివాయ…

4 hours ago

అకీరా అరంగేట్రంపై రేణు…

ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్‌దే.…

5 hours ago

భీమ్స్‌కు ‘మెగా’ ఛాన్స్?

టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్‌ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ…

6 hours ago