సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి కోర్టు కేసు ఎదురుకుని బెయిల్ మీద బయటికి వచ్చిన అల్లు అర్జున్ నిన్నంతా తన ఇంట్లోనే టాలీవుడ్ సెలబ్రిటీల రాకతో యమా బిజీగా గడిపేశాడు. ఉదయం నుంచి మొదలుకుని రాత్రి పొద్దుపోయే దాకా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా వందలాది ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టడంతో వాళ్ళను రిసీవ్ చేసుకోవడం, మాట్లాడ్డంతోనే సమయం గడిచిపోయింది. అయితే అభిమానులు ఎదురు చూసిన ప్రత్యేక కలయికలు వేరే ఉన్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవిది ఒకటి. అది ఇవాళ జరిగింది. ఫ్యాన్స్ కోరుకున్న క్షణం కళ్లెదురు వచ్చేసింది.
మధ్యాన్నం 12 గంటలకు కుటుంబంతో పాటు స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లిన బన్నీకి సాదర స్వాగతం లభించింది. మొన్న అరెస్ట్ విషయం తెలియగానే విశ్వంభర షూటింగ్ అప్పటికప్పుడు రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి తొలుత వెళ్ళింది మెగాస్టారే. నిన్న సతీమణి, బన్నీ మేనత్త సురేఖ వచ్చి వెళ్లడం, అల్లుడిని చూసి ఎమోషన్ కావడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. అప్పటి నుంచి మెగా అల్లు కాంబో కోసం అందరూ వెయిట్ చేశారు. సుమారు గంటకు పైగా అక్కడ ఉన్న అల్లు అర్జున్ తర్వాత వెళ్లిపోయారు. భార్య స్నేహ, పిల్లలు కూడా తనతోనే ఉన్నారు.
గత కొన్ని నెలలుగా మెగా వర్సెస్ అల్లుగా మారిపోయిన ఫ్యాన్స్ ఆన్ లైన్ యుద్ధం ఇప్పుడీ ములాఖత్ తో తగ్గే అవకాశాలు లేకపోలేదు. నంద్యాల పర్యటన నుంచి బన్నీ మీద మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. దీన్ని తేలికపరిచే సందర్భం తర్వాత ఎప్పుడూ రాలేదు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో స్పీడ్ బ్రేకర్ లా వచ్చి పడ్డ సంధ్య ఉదంతం నుంచి ఇంకా పూర్తి రిలీఫ్ దక్కలేదు. ప్రస్తుతం దొరికింది నాలుగు వారాల బెయిలే కాబట్టి తీర్పు లేదా పరిష్కారం దొరికే దాకా చిక్కులు తప్పవు. ఈ కారణంగానే ప్లాన్ చేసుకున్న మరికొన్ని సక్సెస్ మీట్లు వాయిదా వేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.
This post was last modified on December 15, 2024 2:17 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…