గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజయ్యాక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న అఖిల్ అభిమానులకు తెరిపినిచ్చాడు. ఇవాళ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయ్యింది. కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున మనం బ్యానర్ తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ దీన్ని పెద్ద బడ్జెట్ తో నిర్మించనుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించే ఈ తిరుపతి బ్యాక్ డ్రాప్ స్టోరీకి తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. రెండు ఊళ్ళ మధ్య జరిగే ఇంటెన్స్ విలేజ్ డ్రామాగా కథ బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
నిజానికి అఖిల్ దీని కన్నా ముందు యువి క్రియేషన్స్ తో చేయాల్సింది. అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్యాన్ ఇండియా స్థాయిలో స్క్రిప్ట్ లాక్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల దాన్ని పెండింగ్ లో ఉంచి తర్వాత అనుకున్న దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న అఖిల్ ఇకపై వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున సైతం దగ్గరుండి ఈ ప్రాజెక్టు తాలూకు పనులు పర్యవేక్షిస్తారని సమాచారం. ఎలాగూ నిర్మాత నాగవంశీ ప్రొడక్షన్ కాబట్టి మరీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకుని షెడ్యూల్స్ వేయబోతున్నారు.
గుంటూరు కారం తర్వాత పరీక్షల కోసం బ్రేక్ తీసుకున్న శ్రీలీల మళ్ళీ బిజీ అయిపోయింది. రాబిన్ హుడ్ వచ్చే నెల రిలీజ్ కానుండగా రవితేజ మాస్ జాతర మే 9న థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇప్పుడు అఖిల్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే పుష్ప 2లో కిసిక్ కిసిక్ అంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా ప్లస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి మొదలైతే అందులోనూ జాయినవ్వాల్సి ఉంటుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు అఖిల్ కొత్త సినిమా మొదలైపోవడం శుభవార్తే. అందని ద్రాక్ష పండుగా మారిన బ్లాక్ బస్టర్ దీంతో అయినా నెరవేరాలి.
This post was last modified on December 15, 2024 1:12 pm
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…