Movie News

3D పుష్పరాజ్ వచ్చేశాడు…కొత్త అనుభూతి సిద్ధం!!

బాక్సాఫీస్ వద్ద పన్నెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉన్న పుష్ప 2 ది రూల్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. 3D వెర్షన్ ని ఇవాళ్టి నుంచి స్క్రీనింగ్ చేయబోతున్నారు. తొలుత హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లతో మొదలుపెట్టి తర్వాత దేశమంతా షోలు పెంచబోతున్నారు. ఈ మేరకు మైత్రి నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. మాములుగా కమర్షియల్ మాస్ సినిమాలకు త్రిడి అవసరం ఉండదు. ఎందుకంటే స్పెషల్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి. కల్కి 2898 ఏడి, ఆర్ఆర్ఆర్, దేవర లాంటివి పర్వాలేదనిపించాయి కానీ ఎక్స్ ట్రాడినరి అనుభూతిని కలిగించలేదు. కానీ పుష్ప 2 అలా ఉండదట.

ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఎఫెక్ట్స్ అబ్బురపరిచేలా ఉంటాయని ముఖ్యంగా ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, జాతర, క్లైమాక్స్ లాంటి చోట బాగా ఆస్వాదించవచ్చని యూనిట్ టాక్. ఇప్పుడీ అంశం వసూళ్ల పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే థియేటర్లో రెండు మూడు సార్లు ఎక్స్ పీరియన్స్ అయినవాళ్లు మరోసారి 3డిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎలాగూ మూడో వారం నుంచి సాధారణ టికెట్ రేట్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వసూళ్ల పెంపు చూడొచ్చు. ఆల్రెడీ బుక్ మై షోలో రెండో శనివారం మిలియన్ టికెట్లు అమ్మిన మరో రికార్డు సొంతం చేసుకున్న పుష్ప 2 మూడో వారాంతాన్ని కూడా కంట్రోల్ లో తీసుకుంటాడు.

హిందీలో పుష్ప 2ని ఇంకా ఎక్కువ ఆదరిస్తున్న తరుణంలో షోలను విపరీతంగా పెంచే అవకాశం ఉంది. ఇవాళ తెల్లవారుఝామున గుజరాత్, మహారాష్ట్ర లాంటి చోట్ల అర్ధరాత్రి షోలు అప్పటికప్పుడు యాడ్ చేసినా త్వరగా హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక సౌత్ డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో ర్యాంపేజ్ చేయడం చూడలేదని బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల మార్కు కూడా త్వరగా చేరుకునే అవకాశముంది. క్రిస్మస్ కి పెద్ద ఎత్తున రిలీజులు ఉన్నాయి కాబట్టి పుష్ప 2కి రాబోయే నాలుగు రోజులు కీలకం కాబోతున్నాయి. వీలైనంత రెవిన్యూ రాబట్టుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్ కౌంట్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గనుంది.

This post was last modified on December 15, 2024 1:53 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago