ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ షూటింగ్ క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఏ స్టేజిలో ఉందనే సమాచారం టీమ్ ఇవ్వడం లేదు కానీ ఏప్రిల్ 10 విడుదల మీద క్రమంగా అనుమానాలు ముసురుకుంటున్నాయి. అప్పటికంతా ఫస్ట్ కాపీ అవ్వకపోవచ్చని, వాయిదా దాదాపు ఖరారేననే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఇదే కనక జరిగితే ఆ స్థానంలో చిరంజీవి విశ్వంభర వచ్చే అవకాశాలను రెండు వారాల క్రితమే మా సైట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్పెషల్ సాంగ్ కోసం ది రాజా సాబ్ కోసం ఒక అరుదైన కలయిక పద్దెనిమిదేళ్ల తర్వాత జరగనుందని సమాచారం.
2007లో ప్రభాస్, నయనతార జంటగా యోగి చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ పాటలు బాగా రీచ్ అయ్యాయి. కెరీర్ ప్రారంభంలో ఉన్న నయన్ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. తర్వాత ఈ కాంబో మళ్ళీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం కలవడమంటే విశేషమే. అయితే ఇదింకా అధికారిక ధృవీకరణ కాలేదు. నిజానికి నయన్ చాలా ఏళ్లుగా స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు. లేడీ సూపర్ స్టార్ బ్రాండ్ వచ్చాక కేవలం ఫుల్ లెన్త్ రోల్స్ మాత్రమే ఒప్పుకుంటోంది. మరి ప్రభాస్ కు వెసులుబాటు ఇచ్చిందా అంటే వేచి చూడాలి.
ఒకవేళ ఎస్ అయితే మాత్రం ఇదో స్పెషల్ న్యూసే అవుతుంది. తమిళంలో పెద్ద హీరోలకే అంత త్వరగా ఎస్ చెప్పని నయనతార ఇప్పుడు ది రాజా సాబ్ లో కనిపిస్తే బజ్ పరంగానూ ఉపయోగపడుతుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ హారర్ డ్రామా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటిదాకా టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడనంత గ్రాండియర్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని పెంచింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ది రాజా సాబ్ బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటే.
This post was last modified on December 15, 2024 12:08 pm
మంచు వారి కుటుంబ గొడవ కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తుండగా.. మళ్లీ ఓ వివాదంతో ఆ ఫ్యామిలీ వార్తల్లోకి వచ్చింది. తన…
ఇప్పటి వరకు పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అడ్డుకోలేదు. వారికి ఎక్కడా.. బ్రేకులు వేయలేదు.…
వైసీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన మకాం మార్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయం.. ఒంగోలు…
తమిళ హీరో విజయ్ సేతుపతి మనకు బాగా దగ్గరయ్యింది ఉప్పెన నుంచే. కృతి శెట్టి తండ్రి రాయణం పాత్రలో చూపించిన…