Movie News

కంగువపై ట్రోలింగ్.. దర్శకుడి క్లాస్!

ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టిన చిత్రాల్లో ‘కంగువ’ ఒకటి. కోలీవుడ్‌కు బాహుబలి అవుతుందని.. వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని అంచనాలు పెట్టుకుంటే.. ఆ ఇండస్ట్రీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం. ఈ సినిమాకు ఫస్ట్ షో పడడం ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మోతెక్కిపోయాయి. ఓవైపు విమర్శకులు సినిమాను చీల్చిచెండాడుతుంటే.. మరోవైపు నెటిజన్లు మీమ్స్‌తో విపరీతంగా ట్రోల్ చేశారు.

వేరే హీరోల అభిమానులు కూడా పనిగట్టుకుని ఈ సినిమా గురించి చెడుగా ప్రచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో సూర్య అభిమానులు ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. సూర్య లాంటి మంచి నటుడి సినిమాకు ఇలా జరగాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సూర్యకు మద్దతుగా ఒక ప్రముఖ దర్శకుడు వాయిస్ వినిపించాడు. ఆయనే.. మిస్కిన్.డిటెక్టివ్, పిశాచి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న మిస్కిన్.. తాజాగా ఒక సినిమా ఈవెంట్లో ‘కంగువ’ ఫలితం గురించి మాట్లాడాడు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కాలంలో జనాలకు సహనం తగ్గిపోయిందని.. విపరీతమైన కోపంతో, అసహనంతో సినిమాలు చూస్తున్నారని ఆయన అన్నాడు. ఆ కోపంతోనే సినిమాల గురించి ఉన్నదానికంటే ఎక్కువగా నెగెటివ్గా మాట్లాడుతున్నారని మిస్కిన్ వ్యాఖ్యానించాడు. ‘కంగువ’ సినిమాను అంతగా ట్రోల్ చేయాల్సింది కాదన్నారు. తాను ఆ సినిమా చూడలేదని.. కానీ సూర్య చాలా గొప్ప నటుడని, అందమైన ఆర్టిస్ట్ అని.. అలాంటి వాళ్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని మిస్కిన్ అన్నాడు.

శివాజీ గణేషన్, ఎంజీఆర్ లాంటి లెజెండ్స్ ఇప్పడు లేరని.. వారితో కలిసి నటించిన శివకుమార్ మాత్రం ఉన్నారని.. ఆయన సూర్య, కార్తిల రూపంలో మంచి కొడుకులను, గొప్ప నటులను కన్నారని.. అలాంటి వాళ్ల విషయంలో ప్రేమతో వ్యవహరించాలని మిస్కిన్ అభిప్రాయపడ్డాడు. ఒక రాకెట్ సైంటిస్ట్ ఎన్నో ఏళ్ల పాటు నిద్రాహారాలు మాాని ఒక మిషన్ మీద పని చేస్తాడని.. అందులో చిన్న లోపం తలెత్తినా తన కష్టమంతా వృథా అవుతుందని.. అలాంటి వాళ్ల మీద ఎలా కరుణ చూపిస్తామో సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడే తమ మీద కూడా కరుణ చూపించాలని మిస్కిన్ అన్నాడు.

తాను సూర్యతో సినిమా చేయడం కోసం ఇదంతా మాట్లాడ్డం లేదని.. అతను సినిమా ఇస్తానన్నా వద్దనే అంటానని.. కానీ తన లాంటి మంచి నటులను కాపాడుకోవాలని, వారి పట్ల కరుణతో వ్యవహరించాలని మిస్కిన్ చెప్పాడు.

This post was last modified on December 14, 2024 2:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కపిల్ కోతి ప్రశ్న….అట్లీ అదిరిపోయే సమాధానం!

రాజమౌళి, సుకుమార్ తర్వాత ఒక సౌత్ దర్శకుడు బాలీవుడ్ లో బలమైన జెండా పాతింది అంటే అట్లీనే. షారుఖ్ ఖాన్…

7 mins ago

పేద‌రికం అంటారు.. ప‌నిచేయ‌క‌పోతే ఎలా: నారాయణ‌మూర్తి చుర‌క‌లు

ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌.. ఇన్ఫోసిస్ అధినేత నారాయ‌ణ‌మూర్తి.. చుర‌క‌లు అంటించారు. ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ప‌నిగంట‌ల విష‌యంలో ఓ…

1 hour ago

శంకర్ మార్క్ మాస్ చూస్తారు : రామ్ చరణ్ !

ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ…

2 hours ago

త‌..’భ‌ళా’.. మూగ‌బోయింది.. ఉస్తాద్ ఇక‌లేరు!

అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. "అంద‌రూ త‌బ‌లా వాయిస్తారు. నువ్వేంటి ప్ర‌త్యేకం"- ఇదీ.. 15 ఏళ్ల వ‌య‌సులో త‌న…

2 hours ago

పిఠాపురంలో కోడి పందేలు.. వర్మ కు పరీక్షే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్‌వీఎస్ ఎస్ వ‌ర్మ‌కు సొంత నియోజ‌క‌వర్గం పిఠాపురంలో మ‌రోసారి…

8 hours ago