మూడు నెలల క్రితం హైదరాబాద్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పుడు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. నిజానికి రభస టైంలో ఒక అభిమాని రద్దీలో చనిపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి ఓపెన్ గ్రౌండ్స్ వేడుకలకు దూరంగా ఉంటున్నాడు. తాను నటించని బయటివాటికి గెస్టుగా వెళ్ళాడు తప్పించి హీరోగా చేసిన సినిమాలకు మాత్రం నో అవుట్ డోర్ సూత్రం పాటించాడు. అందులో భాగంగానే నోవాటెల్ లో క్యాన్సిలయ్యింది బయట వేరే ఊరిలో ఎక్కడైనా పెట్టమని ఫ్యాన్స్ ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా ఒప్పుకోలేదు. కొందరైతే ట్విట్టర్ లో కళ్యాణ్ రామ్ ని నిందించారు.
కట్ చేస్తే తోపులాట తాలూకు పరిణామాల్లో ఏ చిన్న దుర్ఘటన జరిగినా వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో పుష్ప 2 నిరూపించింది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని తీసుకున్న నిర్ణయం జైలు మెట్లు ఎక్కిస్తుందని బన్నీ కల్లో కూడా ఊహించి ఉండడు. కానీ దురదృష్టవశాత్తు జరిగింది. దేవరకొచ్చిన జనసందోహాన్ని చూశాక ఒకవేళ అలాగే ఇరుగ్గా ఈవెంట్ చేసి ఉంటే ఏదైనా జరగొచ్చనే భయమే తారక్ ని కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ తర్వాత పుష్ప 2 అంతకన్నా పెద్ద ఈవెంట్లు చేసింది కానీ ఒక్క శాతం రిస్క్ కూడా వద్దనుకునే జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఇకపై మారబోదని చెప్పొచ్చు.
థియేటర్లకు లైవ్ గా వెళ్లి అందరికి తెలిసేలా సినిమాలు చూసేందుకు కూడా తారక్ వ్యతిరేకం. ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఇప్పటిదాకా ఏదీ చూడలేదని రాజమౌళితో చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా జరిగిన పరిణామాల వల్ల మొత్తం టాలీవుడ్ ఈవెంట్లన్నీ ఆగిపోతాయని కాదు కానీ భవిష్యత్తులో పోలీసులు, నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సెట్స్ లో జాయినవుతాడు. దేవర 2 ఎప్పటి నుంచి ఉంటుందనే సంకేతం మాత్రం ప్రస్తుతానికి ఇవ్వడం లేదు. అది చెప్పాల్సింది కొరటాల శివనే.
This post was last modified on December 14, 2024 11:18 am
రాజమౌళి, సుకుమార్ తర్వాత ఒక సౌత్ దర్శకుడు బాలీవుడ్ లో బలమైన జెండా పాతింది అంటే అట్లీనే. షారుఖ్ ఖాన్…
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. చురకలు అంటించారు. ఆయన గత కొన్నాళ్లుగా పనిగంటల విషయంలో ఓ…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజైనప్పటికీ…
అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. "అందరూ తబలా వాయిస్తారు. నువ్వేంటి ప్రత్యేకం"- ఇదీ.. 15 ఏళ్ల వయసులో తన…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్వీఎస్ ఎస్ వర్మకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి…