పుష్ప 2 బెనిఫిట్ షోకి జరిగిన రాద్ధాంతం వల్ల అల్లు అర్జున్ ఏకంగా అరెస్ట్ దాకా వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మహిళ చనిపోవడం బాధాకరమే అయినా దానికి బన్నీని బాధ్యుణ్ణి చేయడం ఎవరూ హర్షించడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ కి స్పెషల్ ప్రీమియర్లు ఉంటాయా లేదానే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ లిస్టులో ముందు వచ్చేది గేమ్ ఛేంజర్. జనవరి 10 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా జరుగుతున్నాయి. డిసెంబర్ 21న యుఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు పెంచబోతున్నారు.
ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ఒక రోజు ముందు అంటే జనవరి 9నే ఉంటాయని అఫీషియల్ హ్యాండిల్ లో ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మాములుగా యుఎస్ షెడ్యూల్ ప్రకారమైతే ఏ సినిమాకైనా మనకన్నా డేట్ ఒక రోజు ముందు వస్తుంది. కానీ పోస్టర్ లో వరల్డ్ వైడ్ అన్నారు కాబట్టి అన్నిచోట్లా అనే అర్థం వస్తుంది. మరి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయా అంటే సాంకేతికంగా ఛాన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ముందు రోజు రాత్రి వేసే సెకండ్ షోను రెగ్యులర్ షోగా చూపించుకుంటే గవర్నమెంట్ నుంచి అభ్యంతరం ఉండదు. అలా కాకుండా అర్ధరాత్రి షో అయితే పర్మిషన్ తెచ్చుకోవాలి.
నిర్మాత దిల్ రాజు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. గేమ్ ఛేంజర్ కున్న డిమాండ్ ని బట్టి చూస్తే ప్రీమియర్లు వేయడం మంచి ఆలోచనే. కాకపోతే సంధ్య 70 ఎంఎం ఉదంతం తర్వాత తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. పోలీస్ శాఖ సైతం అంత ఈజీగా పర్మిషన్లు, సెక్యూరిటీ ఇచ్చేలా లేదు. అసలే సంక్రాంతి సీజన్. వరస సెలవులు. ముందుగా రిలీజయ్యే అడ్వాంటేజ్. ఇవన్నీ వాడుకోవాలంటే గేమ్ ఛేంజర్ కు ప్రత్యేక వెసులుబాట్లు దక్కాలి. ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. టికెట్ ధరల పెంపుకు సంబంధించిన ప్రొసీజర్ కూడా యుఎస్ నుంచి రాగానే మొదలుపెడతారు.
This post was last modified on December 14, 2024 4:45 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…