చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది తనకు సంఘీభావం ప్రకటించారని, అన్ని చిత్ర పరిశ్రమల నుంచి చాలామంది వ్యక్తులు, అభిమానులు తనకు మద్దతునిచ్చారని, వారందరికీ ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు. తాను బాగానే ఉన్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసులు, అధికారులకు సహకరిస్తానని అన్నారు.
మృతురాలు రేవతి కుటుంబానికి మరోసారి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఆ ఘటన జరగడం దురదష్టమని, అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ కు 20 ఏళ్లుగా వెళుతున్నానని, తన సినిమాలతో పాటు మిగతా సినిమాలు చూసేందుకు దాదాపు 30 సార్లు అక్కడకు వెళ్లి ఉంటానని అన్నారు. కానీ, ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని అన్నారు. చనిపోయిన రేవతి గారిని తిరిగి తీసుకురలేమని, కానీ, ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, వారిని ఆదుకుంటానని చెప్పారు.
చట్టంపై తనకు నమ్మకుందని అన్నారు. తాను బాగున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని. తన కుటుంబానికి కూడా ఇది కష్ట సమయం అని, తాను అరెస్టు కావడంతో వారు చాలా బాధపడ్డారని చెప్పారు. లీగల్ అంశాల గురించి తాను ఏమీ మాట్లాడకూడదని, మాట్లాడబోనని అన్నారు. తనకు ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates