రిలీజ్ అయిన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర ఉత్కంఠ కు తెరదించుతూ ఈ రోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు వెనుక గేటు నుంచి వెళ్లిపోయిన అల్లు అర్జున్…జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి కాకుండా నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. పోలీస్ ఎస్కార్ట్ మధ్య బన్నీ అక్కడకు వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఆయన మామ చంద్ర శేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అక్కడే ఉన్నారు. దీంతో, అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు.

కాసేపు అక్కడ ఉన్న తర్వాత జూబ్లీహిల్స్ నివాసానికి బన్నీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బన్నీ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. బన్నీని చూసేందుకు భారీగా అభిమానులు అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.