ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయితే.. బెయిల్ దక్కుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కు అల్లు వచ్చారు. అయితే.. ఆ సమయంలో ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున మూగారు.ఇది తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సంథ్య ధియేటర్ సహా.. అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.
సంధ్య ధియేటర్ యాజమాన్యం తమకు సంబంధం లేదని.. డిస్ట్రిబ్యూటర్లకు తాము ఆ రోజు షోలకు సంబంధించి సినిమా హాలును అద్దెకు ఇచ్చామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి.. కేసు కొట్టివేయాలని అభ్యర్థించింది. దీనిపై విచారణ పెండింగులో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా పోలీసులు తొక్కిసలాటకు.. కారణం చెప్పాపెట్టకుండా.. అల్లు అర్జున్ ధియేటర్ వద్దకు రావడమేనని పేర్కొంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి స్టేషన్‌కు తీసుకువచ్చారు.
వాస్తవానికి శుక్రవారం అల్లు నుంచి పోలీసులు స్టేట్‌మెంటును రికార్డు చేసుకుంటారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి.. అటు నుంచి ఉస్మానియాకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం గమనార్హం. ఒకవేళ బన్నీ అరెస్టు చేస్తే.. ఆయనను వెంటనే రిమాండ్‌కు పంపాల్సి ఉంటుంది కానీ, వరుస కోర్టు సెలవుల కారణంగా.. అల్లుకు బెయిల్ వచ్చే అవకాశం లేనందున అల్లు అభ్యర్థన మేరకు పోలీసులు మరో రోజు అరెస్టు చేయొచ్చని ఆయన అభిమానులు భావించారు.
ఇదిలావుంటే.. అల్లు అర్జున్‌పై బీఎన్ ఎస్ సెక్షన్లు.. 105, 118 (1),రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. వీటి ప్రకారం అర్జున్ పై నేర నిరూపణ అయితే.. జైలుకు పంపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి,. మరోవైపు శుక్రవారమే ఆయనపై విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తే బెయిల్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే.. శనివారం, ఆదివారం రెండు రోజులు కూడా.. కోర్టుకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 13, 2024 2:43 pm
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…