పవన్ కళ్యాణ్ ఓజి కోసం అభిమానుల ఎదురు చూపులు అలనాడు ఋషుల తపస్సు కన్నా తీవ్రంగా మారిపోయాయి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే వాళ్ళను విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తోంది. వచ్చే ఏడాది ముందు రిలీజయ్యే సినిమా హరిహర వీరమల్లు అని తెలిసినా సరే ఓజి ఉద్వేగాన్ని అణుచుకోలేకపోతున్నారు. దానికి తగ్గట్టే డివివి హ్యాండిల్ క్రమం తప్పకుండా ప్రమోషన్లలో యాక్టివ్ గా ఉండటం ప్లస్ అవుతోంది. తాజాగా ఛాయాగ్రాహకులు రవి కె చంద్రన్ తన ఇన్స్ టాలో క్రేజీ న్యూస్ ఇచ్చారు.
ఓజిలో భాగం పంచుకోనున్న ఇద్దరు కీలక నటుల గురించి ఆయన పిక్స్ పోస్ట్ చేశారు. వాటిలో మొదటి వ్యక్తి వితయ పన్‌స్రింగార్మ్. థాయిలాండ్ కు చెందిన ఈ ప్రసిద్ధ నటుడు ఓన్లీ గాడ్ ఫర్గివ్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. 65 ఏళ్ళ వయసులోనూ చలాకీగా కనిపించడం వితయ ప్రత్యేకత. ముప్పై ఏళ్ళకు పైగా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించిన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అక్టోబర్ లో రిలీజైన డోంట్ కంలో మంచి క్యారెక్టర్ పోషించాడు. ఓజిలో సుజిత్ తనకు ఏం డిజైన్ చేశాడు అన్నది సస్పెన్స్.
ఇక రెండో నటుడు కజుకి కితామురా. జపాన్ కు చెందిన ఈ యాక్షన్ స్పెషలిస్ట్ ఓజిలో నెగటివ్ షేడ్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇతని వయసు 55. కిల్ బిల్, గాడ్జిల్లా ఫైనల్ వార్స్, కిల్లర్స్, ప్యారాసైట్, హెల్ డాగ్స్, లెట్స్ గో కరోకే లాంటి సినిమాల ద్వారా ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. మినజుకిలో పెర్ఫార్మన్స్ కు గాను యోకోహోమా ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం దక్కించుకున్నాడు. వీళ్లిద్దరూ ఓజిలో ఉండటం చూస్తే సుజిత్ హైప్ ని పూర్తిగా హద్దులు దాటిస్తున్నాట్టే. మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ లో చేరబోతున్నారు. 2025 ద్వితీయార్థంలో విడుదలకు డివివి సంస్థ ప్లాన్ చేసుకుంటోంది.
This post was last modified on December 13, 2024 10:15 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…