ప్రభాస్‌ను చూసి ఇండియాలో చాలామంది హీరోలు అసూయ పడుతుంటే ఆశ్చర్యమేమీ లేదు. చాలామంది స్టార్లు దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న ఫాలోయింగ్, తెచ్చుకున్న ఇమేజ్‌ను ప్రభాస్ కేవలం ఒక్క సినిమాతో, చాలా తక్కువ సమయంలో తెచ్చుకున్నాడు. రెండు భాగాల బాహుబలి అతడి రాతను మార్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్లను మించిన ఫాలోయింగ్, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. అలాగని ఇది అయాచితంగా వచ్చిందని కూడా అనలేం. ప్రభాస్ కూడా ఎంతో శ్రమించాడు. రాజమౌళి ప్రతిభ అతడికి వరంలా కలిసొచ్చి ఊహించని స్థాయిని అందుకున్నాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో డిజాస్టర్ అయినా సరే.. ప్రభాస్ ఇమేజ్ చెక్కుచెదరలేదనడానికి ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాల రేంజ్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలకు కుదురుతున్న కాస్టింగ్, బడ్జెట్, స్కేల్ ఇవన్నీ చూసి వేరే హీరోలు జీర్ణించుకోవడం కష్టమే. దీపికా పదుకొనే మరో తెలుగు హీరోతో సినిమా అంటే ఒప్పుకుంటుందా.. అమితాబ్ బచ్చన్ ఇంకో టాలీవుడ్ హీరో సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి అంగీకరిస్తాడా.. ఇంకే హీరో సినిమాకైనా నిర్మాతలు ధైర్యంగా వందల కోట్ల బడ్జెట్లు పెట్టడానికి రెడీ అవుతారా.. సందేహమే లేదు ఇది ప్రభాస్ ఒక్కడికే సాధ్యం.
ప్రభాస్ సినిమాలకు సంబంధించిన ఈ భారీ అప్‌డేట్లు చూసినపుడల్లా వేరే హీరోల ఆలోచన ఎలా ఉంటోందో కానీ.. వాళ్ల అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ప్రభాస్ మీద పడి తెగ ఏడ్చేస్తున్నారు. ఇదంతా రాజమౌళి పుణ్యం అని, ప్రభాస్‌ది ఏమీ లేదని అతణ్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్రెడిట్ మొత్తం రాజమౌళిదే అయితే.. ఆర్ఆర్ఆర్‌తో తారక్, చరణ్‌ల ఇమేజ్ కూడా ఇలాగే మారి వాళ్లు కూడా పాన్ ఇండియా స్టార్లయిపోతారేమో చూడాలి. అలా కాని పక్షంలో ప్రభాస్ వేరు అనే సంగతి గుర్తించాల్సిందే. ముందు అసలు మిగతా టాలీవుడ్ హీరోలను ప్రభాస్‌తో పోల్చడం మాని.. అతను మన ప్రైడ్ అనే విషయాన్ని అందరు అభిమానులూ అంగీకరిస్తే.. అతణ్ని పక్కన పెట్టేసి తమ హీరోల ఘనతల గురించి మాట్లాడుకుంటే మంచిదనడంలో సందేహం లేదు.
This post was last modified on October 10, 2020 3:24 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……