కొన్నేళ్ల క్రితం రాజమౌళి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువ క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని, నిజంగా ఆయన కనక మాస్ ని సీరియస్ గా తీసుకుంటే తాము వెనుకబడిపోతామని చెప్పడం అప్పట్లో వైరలయ్యింది. జగడంలాంటి డార్క్ మాఫియా డ్రామాలో ఇంట్రో సీన్ ని జక్కన్న విపరీతంగా ఇష్టపడతారు. అందరూ వెనక్కు వెళ్తుంటే రౌడీ మూకకు రామ్ ఒక్కడే ఎదురు వెళ్లే షాట్ ఓ రేంజ్ లో పేలింది. కానీ ఆర్య నుంచి నాన్నకు ప్రేమతో వరకు సుకుమార్ స్టైల్ ఎక్కువగా అర్బన్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది. రంగస్థలంతో రూటు మార్చడమే కాదు కమర్షియల్ పల్స్ మీద తన పట్టుని నిరూపించుకున్నారు.
ఇప్పుడు పుష్ప 2 వెయ్యి కోట్ల గ్రాస్ సాధించడం చూశాక ఆనాడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవాళ సుకుమార్ నిజం చేసి చూపించారు. ఫాంటసీ టచ్, జానపదం, మల్టీస్టారర్, భారీ టెక్నికల్ హంగులు ఇవేవీ లేకుండా ఒక ఎర్రచందనం దొంగ కథతో ఆల్ ఇండియా రికార్డులు కొల్లగొట్టడం మాములు విషయం కాదు. బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చయి ఉండొచ్చు. కానీ దానికి అంతకంతా వెనక్కు తెచ్చేలా ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తీయడం మాత్రం గొప్ప ఫీటే. అల్లు అర్జున్ కి జాతీయ అవార్డుతో పాటు అంతకు మించి ఎన్నో మైలురాళ్ళు సాధించారు.
సో ఇప్పుడు రాజమౌళికి ధీటుగా సుకుమార్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటినట్టు అయ్యింది. అయితే ఇక్కడితో చాలదు. ఎందుకంటే పుష్పలో అధిక క్రెడిట్ బన్నీకి వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లకు ప్రభాస్, చరణ్, తారక్ లతో పాటు జక్కన్న బ్రాండ్ బలంగా రిజిస్టరయ్యింది. కానీ సుకుమార్ కు ఇంకా అది జరగలేదు. సో రామ్ చరణ్ 17 ద్వారా దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలి. ఆల్రెడీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబోనే కాబట్టి అభిమానులు దీని మీద బోలెడు ఆశలు పెట్టుకుంటున్నారు. పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఎక్కువ వెయిట్ చేయక తప్పదు.
This post was last modified on December 12, 2024 1:22 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…