గత నెల విడుదలైన నయనతార బయోపిక్ డాక్యుమెంటరీ ‘బియాండ్ ది ఫెయిరీ టైల్స్’కు సంబంధించి ధనుష్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆవిడ చేసిన కామెంట్స్ మీద పెద్ద చర్చే జరిగింది. నానుమ్ రౌడీ దాన్ నుంచి క్లిప్స్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వకుండా పది కోట్లు డిమాండ్ చేశాడనే అభియోగం మీద ధనుష్ మీద నయన్ సుదీర్ఘమైన లేఖను విడుదల చేయడం చూశాం. తీరా చూస్తే సదరు ఫిలింలో బిటిఎస్ ఫుటేజ్ ని వాడుకున్న వైనం కనిపించింది. దీని మీద ధనుష్ కోర్టుకు వెళ్లాడని చెన్నై మీడియాలో వచ్చింది కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ విఘ్నేష్ శివన్ రాసిన నాలుగు లైన్ల కోసం మాత్రమే నానుమ్ రౌడీ తాన్ క్లిప్స్ అడిగామని, స్నేహితుడిగా ధనుష్ వెంటనే ఎస్ చెబుతాడనుకుంటే ఇలా చేయడం షాక్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. పదేళ్ల కాలంలో అంతగా ఏం మారిపోయిందో అర్థం కాలేదని అన్నది. ఇతర స్నేహితుల ద్వారా ధనుష్ ని కలిసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని, అందుకే షూటింగ్ జరుగుతుండగా ఫోన్లలో షూట్ చేసిన వీడియోలు వాడుకున్నామని వివరణ ఇచ్చింది. ఇది కాంట్రాక్టులోకి రాదని తేల్చి చెప్పింది. 2022లో జరిగిన పెళ్లికి ధనుష్ ని ఎందుకు పిలవలేదనేది ఫ్యాన్స్ క్వశ్చన్.
ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో పక్కనపెడితే ఇది రిపేర్ చేయలేనంత దూరం వెళ్ళిపోయిన మాట వాస్తవం. తన కెరీర్, ప్రేమ, పెళ్లి మీద తీసిన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తుందనుకుంటే దానికి భిన్నంగా ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోవడం నయన్ కు షాక్ కలిగించింది. నిర్మాతలు లేడీ సూపర్ స్టార్ అనడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన నయనతార మరి కమల్ హాసన్, అజిత్ లాగా పబ్లిక్ గా వద్దని ఎందుకు చెప్పడం లేదో అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటికీ ఆరు తమిళ, మలయాళ సినిమాలతో చాలా బిజీగా ఉన్న నయనతార తెలుగు ఆఫర్లు మాత్రం నో అంటోంది.
This post was last modified on December 12, 2024 12:57 pm
ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో గేమ్ ఛేంజర్ ఆగమనం జరగనుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత టాలీవుడ్ నుంచి…
వన నేషన్ - వన్ ఎలక్షన్ అనే విషయంలో చాలా కాలంగా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు…
వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఊహించని రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న ప్రసిద్ధ గాయని టేలర్ స్విఫ్ట్ ఇటీవల సంచలన…
టాలీవుడ్ సినీ ప్రియులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ‘నేను శైలజ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి…
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.4 వేలు సామాజిక…
ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలాన్ మస్క్ తన సంపాదనతో మరో చరిత్ర సృష్టించారు. స్పేస్ఎక్స్లో భాగస్వామ్య విక్రయం ద్వారా…