మూడు నాలుగు పదుల వయసున్న కొత్త జనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కటి రిలీజ్ చేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ప్యాన్ ఇండియా మార్కెట్ లో పడి రెండేళ్లకు దర్శనమివ్వడమే మహాభాగ్యం అనేలా పరిస్థితులు మారిపోయాయి. అలాంటిది అయిదు దశాబ్దాల నటనానుభవం దాటిన బాలకృష్ణ సంవత్సరానికి రెండు తేవడమంటే గొప్ప విషయమే. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న డాకు మహారాజ్ జనవరి 12 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఖండ 2 డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న బాలయ్య విశ్వరూపం చూడొచ్చని పోస్టర్ వదిలారు.
సకాలంలో డేట్లు ఇచ్చి నిర్మాతల టార్గెట్ చేరుకోవడంలో బాలయ్య ప్లానింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. అఖండ మీదున్న అంచనాల దృష్ట్యా భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శీను డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అంటే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో మొత్తం పూర్తి చేసి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇవాళే ప్రారంభమైన షెడ్యూల్ లో ఫైట్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. ప్రగ్య జైస్వాల్ తో పాటు మొదటి భాగంలో ఉన్న ప్రధాన తారాగణం అఖండ 2లోనూ కొనసాగబోతోంది.
మొత్తానికి బాలకృష్ణ వేగం చూస్తే యువ హీరోలు స్ఫూర్తి చెందాల్సింది చాలా ఉంది. నూరు సినిమాల ప్రయాణం పూర్తయినా నటించడం కొనసాగిస్తూనే హిందూపూర్ ఎమ్మెల్యే బాధ్యతలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులతో పాటు మోక్షజ్ఞ డెబ్యూకి సంబంధించిన వర్క్స్ సైతం బాలయ్య చూసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ స్టాపబుల్ సీజన్ 4ని మరింత వినోదాత్మకంగా మలచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అఖండ 2 మీదున్న హైప్ దృష్ట్యా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖండని మించి ఉంటే మరోసారి రికార్డుల మోతే.
This post was last modified on December 11, 2024 7:25 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…