బాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు. తమిళ హిట్ మూవీ ‘తెరి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పెద్ద మార్పులేమీ చేసినట్లు లేరు. హీరోయిజం, యాక్షన్ డోస్ ఇంకా పెంచి లౌడ్‌గా తీసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే ఇది హిందీ సినిమాయేనా అని ఆశ్చర్యం కలిగింది. సౌత్ సినిమాల ఫ్లేవరే కనిపించింది అందులో. బాలీవుడ్ ఫార్ములా సినిమాలు చాలా వరకు బోల్తా కొడుతున్న నేపథ్యంలో దర్శకుడు కలీస్ పూర్తిగా సౌత్ స్టైల్‌ను అనుకరించినట్లున్నాడు.
‘తెరి’ దర్శకుడు అట్లీనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో తన హ్యాండ్ కూడా సినిమాలో పడ్డట్లే ఉంది. మామూలుగా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించని పంచ్ డైలాగులు.. హీరో ఎలివేషన్లు.. ఊర మాస్ ఫైట్లతోనే సినిమాను నింపేసినట్లున్నారు. ‘బేబీ జాన్’ ట్రైలర్ మాస్ ప్రేక్షకులను బాగానేే ఆకట్టుకుంటోంది. ఐతే అన్నీ బాగున్నా.. హీరోయిన్ కీర్తి సురేష్‌ను ట్రైలర్లో ఎలివేట్ చేయకపోవడం ఆమె ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది.
‘బేబీ జాన్’కు హైప్ పెరగడంలో కీర్తి ఇప్పటిదాకా కీలక పాత్ర పోషించింది. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్లామర్‌ను ఈ సినిమాలోనే ఒలకబోసింది కీర్తి. ఈ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక పాటలో కీర్తి క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది. పాట అంతా ఆమెనే హైలైట్ అయింది. కొన్ని రోజుల పాటు కీర్తి పేరు మార్మోగింది. ట్రైలర్లో మాత్రం ఆమె మీద ఒకట్రెండు షాట్స్ పడ్డాయంతే.
అందులోనూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. కీర్తి కోసం సౌత్ ప్రేక్షకులు ఈ సినిమా చూసేలా.. ఆమెను ట్రైలర్లో ఎలివేట్ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం హీరో ఎలివేషన్లు.. యాక్షన్ మీదే దృష్టిపెట్టారని.. రెండో హీరోయిన్ వామికా గబ్బికి ఇచ్చిన ప్రాధాన్యం.. లీడ్ హీరోయిన్ కీర్తికి ఇవ్వకపోవడం అన్యాయమని కీర్తి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 10, 2024 5:38 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…