దేశమంతా సంచలనం సృష్టిస్తున్న పుష్ప 2 ది రూల్ లో ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు పెట్టిన పేరు తమకు అభ్యంతరకరంగా ఉందంటూ క్షత్రియ సామజిక వర్గానికి చెందిన నాయకుడు ఒకరు విడుదల చేసిన వీడియో మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలంటూ, సంవత్సరాల తరబడి తమ వర్గానికి ఇలాగే అన్యాయం జరుగుతోందంటూ, తమ వాళ్ళను విలన్లుగా చూపిస్తున్నారంటూ ఏకంగా దాడికే పిలుపు ఇవ్వడం వైరలవుతోంది. అయితే ఇక్కడ కొన్ని ఆలోచించాల్సిన విషయాలు, గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఇదే భన్వర్ సింగ్ షెకావత్ పుష్ప 1 ది రైజ్ లోనూ ఉన్నాడు. లంచాలు తీసుకునే వాడిగా చూపించారు. క్లైమాక్స్ లో పుష్పరాజ్ తో పోటీ పడి బట్టలు కూడా విప్పిస్తారు. అప్పుడు రాని అబ్జెక్షన్ ఇప్పుడే ఎందుకు వచ్చిందనేది బన్నీ అభిమానుల లాజిక్. అయినా కేవలం పాత్ర ఇంటి పేరుతో ఏ కుల మతాన్ని తప్పుగా ఆపాదించుకోకూడదు. తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ విలన్లకు రెడ్డి ఉండటం సహజం. అవతల హీరోని కూడా అదే వర్గానికి చెందినవాడిగా చూపిస్తారు. నాయుడు, వర్మ, రావు, చౌదరి ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. ఇవన్నీ కేవలం ఊహాత్మక సృష్టి తప్ప నిజాలు కాదు.
అలా అయితే హిందీలో కొన్ని వందల సినిమాల్లో క్షత్రియ వర్గాన్ని హీరోలుగా విలన్లుగా చూపించిన దర్శక నిర్మాతలు వందల్లో ఉంటారు. అప్పుడు లేని గొంతులు ఇప్పుడు ఎందుకు మేల్కొన్నాయి. ఒక సౌత్ డబ్బింగ్ సినిమా ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్నందుకు పుట్టుకొచ్చిన వివాదమా అంటూ అనుమానపడుతున్న వాళ్ళు లేకపోలేదు. అయినా ఇవన్నీ ప్రేక్షకులను ప్రభావితం చేసేది కాదు కానీ కాంట్రావర్సి చేయడం ద్వారా సదరు వ్యక్తులకు కాసింత పబ్లిసిటీ దక్కుతుందేమో కానీ పుష్ప 2కొచ్చిన నష్టం ఏమి లేదు. ముఖ్యంగా ఇప్పుడీ రచ్చకు కారణమైన ఉత్తరాదిలోనే పుష్పరాజ్ భీభత్సం పీక్స్ లో ఉంది.
This post was last modified on December 10, 2024 3:52 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…