నిన్న హరికథ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “వాడెవడో ఎర్రచందనం దొంగ హీరో” అంటూ చేసిన కామెంట్లు పెద్ద చర్చకే దారి తీశాయి. ఆయన వ్యక్తిగతంగా అన్నది అల్లు అర్జున్ ని కాదు. కేవలం క్యారెక్టరైజేషన్ గురించి మాత్రమే. దానికి రకరకాల అర్థాలు తీసి ఏదేదో ప్రచారం చేశారు. బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడూ డిబేట్లు జరిగాయి. జై భీం కు ఇవ్వకుండా పుష్పకు ఎలా ఇస్తారని కామెంట్లు చేశారు. కానీ ఉత్తమ నటుడి పురస్కారం కేవలం ప్రతిభకు ఇచ్చేది తప్ప అతను నటించిన కథా వస్తువుకి కాదనే వాస్తవం మర్చిపోకూడదు. కొంచెం డీటెయిల్డ్ గా వెళదాం.
రాజేంద్రప్రసాద్ ఏమన్నా కొందరు అపార్థం చేసుకున్నట్టు తప్పు చేసే పాత్రలు హీరోగా గుర్తించబడకూడదు అనే పాయింట్ కు వద్దాం. ఆయన ముప్పై ఏడేళ్ల క్రితం కాష్మోరా అనే సినిమా చేశారు. స్మశానంలో చేతబడులు చేసి అమాయకులను చంపే క్రూరమైన పాత్ర తనది. అద్భుతమైన పెర్ఫార్మన్స్ నిజమే కానీ సామాజికంగా ఆమోదయోగ్యం కాదుగా. ఝాన్సీరాణిలో అమ్మాయిలను మోసం చేసి దొంగ పెళ్లిళ్లతో వాళ్ళ చావు కు కారణమయ్యే వి అనే క్యారెక్టర్ చేశారు. ఇది కూడా నెగటివ్ షేడ్స్ ఉన్నదే. ఆ మాటకొస్తే తన ప్రసంగంలో రాజేంద్రప్రసాద్ లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, పేకాట పాపారావులో తన పాత్రల తప్పుల్ని అక్కడే ఎత్తి చూపించారు.
సో ఒక యాక్టర్ అనేవాడికి ఎలాంటి పరిమితులు కొలమానాలు ఉండవు. చిరంజీవి, కమల్ హాసన్ తో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరూ ఏదో ఒక సినిమాలో నెగటివ్ టచ్ లేదా తప్పులు చేసే పాత్రలు చేసినవాళ్ళే. అంతమాత్రాన వాటినే కొలమానంగా తీసుకుని నటనని జడ్జ్ చేయలేం. రాజేంద్రుడి ఉద్దేశం ఏదైనా సరే దాన్ని నాణేనికి రెండువైపులా అన్నట్టు ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా పుష్పలో బన్నీ చేసింది దుంగల దొంగతనమే కానీ అన్యాయంగా ఎవరివైనా ప్రాణాలు తీయడమో హింసించడమో చేయలేదు. అందుకే ఈ విషయం మీద విపరీత కోణంలో భూతద్దం అక్కర్లేదేమో.
This post was last modified on December 10, 2024 3:31 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…